
సినిమాలో విలన్‌గా కనిపించే సోనూసూద్ రియల్‌లైఫ్‌లో మాత్రం అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఎవరు సాయం అడిగిన లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు సోనూసూద్. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు ఒక్కరోజులో ట్రాక్టర్ పంపించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. లాక్‌డౌన్ తరువాత ప్రసారం అవుతున్న ‘ది కపిల్ శర్మ’ షోకు సోనూసూద్ గెస్ట్‌గా వస్తున్నాడు. అయితే ఈ షోలో సోనూ సూద్ వల్ల సాయం పొందిన చాలా మంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన సోనూసూద్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోని టీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తరువాత కపిల్‌శర్మ యధావిధిగా షోలో నవ్వులు పూయించాడు. ఈ ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. చదవండి: సోనూసూద్ క్రేజ్: ‘ఆచార్య’లో ముఖ్య పాత్ర
Comments
Please login to add a commentAdd a comment