Kapil Sharma Reveals His New Look Of The Kapil Sharma Show Season 4 - Sakshi
Sakshi News home page

Kapil Sharma: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌

Published Sun, Aug 21 2022 3:09 PM | Last Updated on Sun, Aug 21 2022 3:24 PM

Kapil Sharma Reveals His New Look Of The Kapil Sharma Show season 4 - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్లలో కపిల్‌ శర్మ ఒకరు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించే ద కపిల్‌ శర్మ షో కొత్త సీజన్‌ త్వరలో మొదలు కాబోతోంది. దీనికోసం కమెడియన్‌ కొత్త అవతారమెత్తాడు. మరింత యంగ్‌గా తయారై ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మేరకు ఓ ఫొటోను తన ట్విటర్‌లో వదిలాడు కపిల్‌. కొత్త సీజన్‌ కోసం కొత్త లుక్‌.. త్వరలోనే రాబోతున్నా అంటూ ట్వీట్‌ చేశాడు. ఇందులో బ్లాక్‌ టీ షర్ట్‌పైన వైట్‌ కోట్‌ వేసుకుని స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు కపిల్‌. అంతేకాదు, మునుపటి కంటే బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు.

అతడి లుక్‌ చూసి షాకైన అభిమానులు 'ఏంటి సర్‌, మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకున్నాం.. మీ వయస్సును ఎలా రివర్స్‌ చేసుకోగలుగుతున్నారు?', 'వయసు పెరుగుతున్నా నిత్యం యంగ్‌గా ఉండే అనిల్‌ కపూర్‌ నుంచి ఏదైనా రహస్యాన్ని రాబట్టారేమో!', 'మీరు ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కపిల్‌ శర్మ షో మూడో సీజన్‌ ఈ ఏడాది జూన్‌లో ప్రసారమైంది. మరి నాలుగో సీజన్‌ను ఎప్పుడు మొదలు పెడ్తారనేది అధికారికంగా వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే! ఇకపోతే ఈ షోలో కృష్ణ అభిషేక్‌, కికు శారద, సుదేశ్‌ లాహిరి, భారతీ సింగ్‌, సుమోన చక్రవర్తి పలువురు ఉండనున్నారు.

చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
 కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement