ఇటు బుల్లితెర, అటు వెండితెరపై నవ్వులు పూయించిన నటుడు అతుల్ పరుచూరి. 56 ఏళ్ల వయసున్న ఇతడు 'ద కపిల్ శర్మ షో'తో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. అసలు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది? ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
డాక్టర్ కళ్లలో భయం..
అతుల్ మాట్లాడుతూ.. 'నాకు పెళ్లై 25 ఏళ్లవుతోంది. ఈ మధ్యే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లి వచ్చాను. తర్వాత ఉన్నట్లుండి ఆరోగ్యం దెబ్బతింది. సరిగ్గా తినలేకపోయాను. కడుపులో ఏదో వికారంగా అనిపించేది. నాకేదో అవుతోందనిపించింది. నా సోదరుడు కొన్ని మందులిచ్చాడు, కానీ తగ్గలేదు. చాలామంది డాక్టర్లను కలిశాను.. వారు అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోమన్నారు. తీరా ఈ పరీక్ష చేశాక నా ఎదుట నిలబడ్డ డాక్టర్ కళ్లలో భయం కనిపించింది. అప్పుడే నాకేదో సమస్య ఉందని అర్థమైంది. నా కాలేయంలో 5 సెం.మీ. కణతి ఉందని చెప్పారు. అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. నేను కోలుకుంటానా? లేదా? అని అడిగితే తప్పకుండా నయమవుందని బదులిచ్చారు.
చికిత్స వికటించడంతో నడవలేని దుస్థితి
కానీ క్యాన్సర్ ఉందని తేలాక నేను తీసుకున్న చికిత్స నాకు తిరగబడింది. వైద్యులు ఇచ్చిన చికిత్స వల్ల నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నడవడానికి కూడా వీల్లేని దుస్థితికి చేరుకున్నాను. మాట్లాడటానికి కూడా తడబడ్డాను. ఆ పరిస్థితిలో సర్జరీ మంచిది కాదని, నెలన్నర రోజులు ఆగుదామని వైద్యులు సూచించారు. కాదని సర్జరీ చేస్తే పచ్చకామెర్ల వ్యాధి వస్తుందని, కాలేయం మొత్తం నీళ్లతో నిండిపోతుందని.. ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. తర్వాత కీమోథెరపీ సహా మంచి మందులు వాడటంతో నా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించింది' అని చెప్పుకొచ్చాడు అతుల్.
చదవండి: తొలి సినిమాకే స్టార్‌డమ్.. కానీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మంచానపడి.. నోట మాటరాక
Comments
Please login to add a commentAdd a comment