ప్రముఖ కమెడియన్ టీకు తల్సానియా (Tiku Talsania)కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దిల్ హై కీ మంతా నహీ (1991), కబీ హా కబీ నా (1993), ఇష్క్ (1997) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
గుండెపోటు కాదు!
మొదటగా టీకూకు గుండెపోటు వచ్చిందని రూమర్లు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నటుడి భార్య దీప్తి తల్సానియా పేర్కొంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఓ సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం అని దీప్తి తెలిపింది.
ఎవరీ టీకు?
టీకు తల్సానియా.. ప్యార్ కె దో పాల్ (1986) సినిమాతో బాలీవుడ్‌లో నట ప్రస్థానం ప్రారంభించారు. కమెడియన్‌గా దిల్ హై కే మంతా నహీ, ఉమర్ 55కీ దిల్ బచ్‌పన్, బోల్ రాధా బోల్, అండాజ్ ఆప్న ఆప్న, మిస్టర్ బెహరా వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కామెడీకి కాస్త బ్రేక్ ఇచ్చి వక్త్ హమారా హై మూవీలో సీరియస్ లుక్‌లో మెప్పించాడు. దేవదాస్ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
కూతురు కూడా నటిగా..
వీర్, కూలీ నెం.1, రాజా హిందుస్తానీ, రాజు చాచా, హంగామా, బడే మియా చోటే మియా, జుడ్వా.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. చివరగా విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో కనిపించారు. టీకు కూతురు శిఖ తల్సానియా కూడా నటిగా రాణిస్తోంది. సత్యప్రేమ్ కీ కథ, వీరే దీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.
చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
Comments
Please login to add a commentAdd a comment