
IT Department Raids on Actor Sonu Sood House in Mumbai: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచాడు నటుడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు చేర్చారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆయన్ని పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెంటార్‌షిప్ ప్రొగ్రామ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ తరుణంలో బుధవారం (సెప్టెంబర్ 15న) ముంబైలోకి ఆయన కార్యాలయాన్ని ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై ఆఫీస్‌తో పాటు ఆయనకు చెందిన మరో ఆరు స్థలాల్లో కూడా ఏకకాలంలో తనిఖీ జరిగినట్లు సమాచారం.
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. కానీ సోనూసూద్ మాత్రం వీటిపై స్పందించడానికి నిరాకరించాడు. కాగా ఎన్నో మంచి సినిమాలు చేసిన బాలీవుడ్‌తో పాటు ఇతర సౌత్ ఇండియా సినీ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.