సమంత
బ్యాడ్మింటన్ కోర్టులో సమంత అడుగుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటుడు సోనూ సూద్ నిర్మిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సోనూ భావిస్తున్నారు. కానీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
ఇటీవల ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సోనూ సంప్రదింపులు జరిపినప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదట. దీంతో తాజాగా సౌత్‌లో వరుస సక్సెస్‌లు అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్న సమంతతో సంప్రదింపులు జరిపే ఆలోచనలో సోనూ ఉన్నారని టాక్. ఇక సింధు విషయానికొస్తే.. ఆల్రెడీ 2016లో ఒలిపింక్ రజతం సాధించి, ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment