'అభినేత్రి'గా తమన్నా | Tamannah lady oriented movie title abhinethri | Sakshi
Sakshi News home page

'అభినేత్రి'గా తమన్నా

Published Thu, Mar 31 2016 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

'అభినేత్రి'గా తమన్నా

'అభినేత్రి'గా తమన్నా

కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో ఒక్కసారి ఫాంలోకి వచ్చింది మిల్కీ బ్యూటి తమన్నా. బాహుబలి సినిమాలో అవంతికగా నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి తన కెరీర్లోనే తొలిసారిగా ఓ హార్రర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. లాంగ్ గ్యాప్ తరువాత డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవ ఈ సినిమాతో హీరోగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను అఫీషియల్గా ఎనౌన్స్ చేశారు.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో తమన్నా లీడ్ రోల్లో అభినేత్రి పేరుతో ఓ హర్రర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ వర్షన్ను ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగు వర్షన్ను కోనవెంకట్ నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు తన గ్లామర్తో ఆకట్టుకున్న తమన్నా హర్రర్ సినిమాలో ఎంతో వరకు మెప్పింస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement