Abhinethri
-
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
అభినేత్రి 2.. ఒకటి కాదు రెండు దెయ్యాలు
ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి. తమిళ నాట దేవీ పేరుతో విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్‌ను తెరకెక్కించారు. తొలి భాగంలో నటించిన ప్రభుదేవా, తమన్నాలు మరోసారి జంటగా నటించిన ఈ సినిమాలో మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయంటున్నారు చిత్రయూనిట్. అంతేకాదు తొలి భాగంలో తమన్నా మాత్రమే దెయ్యంగా కనిపించగా ఈ సీక్వల్లో ప్రభుదేవా కూడా దెయ్యంగా కనిపంచనున్నాడు. నందితా శ్వేత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్ రవీంద్రన్‌ను సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్యామ్ సీయస్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండింతల థ్రిల్
ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెల ఎలా ఉంటుంది? ఎండలు రెండింతలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చల్లని థియేటర్‌కి వెళితే బోలెడంత థ్రిల్‌కి గురి చేస్తారట ప్రభుదేవా, తమన్నా. కూల్ కూల్ అంటూ హాయిగా థియేటర్లో కూర్చుని మా థ్రిల్‌ని ఎంజాయ్ చేయండి అంటున్నారు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ముఖ్య తారలుగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘అభినేత్రి’ గుర్తుందా? తమిళంలో ‘అభినేత్రి’గా తెలుగులో, ‘దేవి’గా విడుదలైంది. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2 ’ రూపొందింది. ఫస్ట్ పార్ట్ కన్నా సీక్వెల్లో రెండింతల థ్రిల్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితా శ్వేత, డింపుల్ హయాతి, కోవై సరళ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచాలను చేరుకునే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్, డైలాగ్స్: సత్య. -
అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?
బాహుబలి 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా, ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. రెండో భాగంలో కొద్ది క్షణాల పాటే కనిపించినా.. బాహుబలి స్టార్‌గా తమన్నాకు నేషనల్ లెవల్లో మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న బాలీవుడ్ కలను సాకారం చేసుకునేందుకు ఇదే సరైన టైం అని భావిస్తుంది మిల్కీ బ్యూటి. అందుకే సౌత్‌లో ఇప్పటికే అంగీకరించిన సినిమాలకు కూడా నో చెప్తుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవ స్వయంగా నిర్మించి నటించిన అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా, ఆ తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించింది. అయితే ఆ ప్రాజెక్ట్‌పై ఎనౌన్స్మెంట్ కూడా వచ్చిన తరువాత ఇప్పుడు తమన్నా నో చెప్పేసిందట. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిన మిల్కీ బ్యూటి, బాలీవుడ్ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. -
చరణ్‌ని లైట్ తీసుకుంటున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చరణ్ కూడా బ్రూస్ లీ బాధ నుంచి అభిమానులను బయటికి తీసుకువచ్చేందుకు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అయితే దసర బరిలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న చరణ్‌కు ఇప్పుడు గట్టి పోటి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాను దసరకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డేట్ ప్రకటించకపోయినా దసర రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక భారీ బడ్జట్‌తో తెరకెక్కుతున్న కన్నడ సినిమా జాగ్వర్ను అదే పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నారు. ప్రభుదేవ, సోనూసూద్, కోన వెంకట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అభినేత్రిని కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్, అభినేత్రి డబ్బింగ్ సినిమాలే అయినా భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద కూడా సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. చరణ్ ధృవ రిలీజ్ అవుతున్నా, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ భారీ పోటి చరణ్ సినిమా మీద ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. -
బాలీవుడ్ సినిమా అయినా.. గాడిలో పెడుతుందా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన వెంకట్ చేయి పడిందంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేంది. అయితే రాను రాను ఈ స్టార్ రైటర్ ఆ ఫాంను కోల్పోయాడు. పండగచేస్కో, అఖిల్, బ్రూస్ లీ, త్రిపుర, సౌఖ్యం ఇలా వరుస ఫ్లాప్‌లు కోక కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక తానే నిర్మాతగా మారి దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తూ తెరకెక్కించిన శంకరాభరణం కోన టాలెంట్ మీద అనుమానాలు కలిగేలా చేసింది. అయితే తరువాత డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోన కాస్త పరవాలేదనిపించాడు. టాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోవటంతో పరభాష ఇండస్ట్రీల మీద దృష్టిపెడుతున్నాడు కోన వెంకట్. ప్రస్తుతం ప్రభుదేవా తో కలిసి కోలీవుడ్‌లో రూపొందుతున్న అభినేత్రి సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాకు ఓ కథ వినిపించిన కోన, ఆ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ హీరోగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌కు కథ వినిపించిన కోన, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ లో అయిన కోనకు సక్సెస్ ట్రాక్ దొరుకుతుందేమో చూడాలి. -
'అభినేత్రి'గా తమన్నా
కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో బాహుబలి సినిమాతో ఒక్కసారి ఫాంలోకి వచ్చింది మిల్కీ బ్యూటి తమన్నా. బాహుబలి సినిమాలో అవంతికగా నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి తన కెరీర్లోనే తొలిసారిగా ఓ హార్రర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. లాంగ్ గ్యాప్ తరువాత డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవ ఈ సినిమాతో హీరోగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపధ్యంలో తమన్నా లీడ్ రోల్లో అభినేత్రి పేరుతో ఓ హర్రర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ వర్షన్‌ను ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగు వర్షన్‌ను కోనవెంకట్ నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లు తన గ్లామర్‌తో ఆకట్టుకున్న తమన్నా హర్రర్ సినిమాలో ఎంతో వరకు మెప్పింస్తుందో చూడాలి. The title of our film in Telugu #abhinetri @PDdancing #sonusood directed by vijay @konavenkat99 pic.twitter.com/o7V58uiJ28 — Tamannaah Bhatia (@tamannaahspeaks) 30 March 2016