బాలీవుడ్ సినిమా అయినా.. గాడిలో పెడుతుందా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన వెంకట్ చేయి పడిందంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేంది. అయితే రాను రాను ఈ స్టార్ రైటర్ ఆ ఫాంను కోల్పోయాడు. పండగచేస్కో, అఖిల్, బ్రూస్ లీ, త్రిపుర, సౌఖ్యం ఇలా వరుస ఫ్లాప్లు కోక కెరీర్ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక తానే నిర్మాతగా మారి దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తూ తెరకెక్కించిన శంకరాభరణం కోన టాలెంట్ మీద అనుమానాలు కలిగేలా చేసింది. అయితే తరువాత డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోన కాస్త పరవాలేదనిపించాడు.
టాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోవటంతో పరభాష ఇండస్ట్రీల మీద దృష్టిపెడుతున్నాడు కోన వెంకట్. ప్రస్తుతం ప్రభుదేవా తో కలిసి కోలీవుడ్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాకు ఓ కథ వినిపించిన కోన, ఆ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ హీరోగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్కు కథ వినిపించిన కోన, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ లో అయిన కోనకు సక్సెస్ ట్రాక్ దొరుకుతుందేమో చూడాలి.