అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..? | tamannaah returns the advance amount for prabhudeva Film | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?

Published Tue, May 2 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?

అడ్వాన్స్ తిరిగిచ్చేసిన తమన్నా..?

బాహుబలి 2 సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా, ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. రెండో భాగంలో కొద్ది క్షణాల పాటే కనిపించినా.. బాహుబలి స్టార్గా తమన్నాకు నేషనల్ లెవల్లో మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న బాలీవుడ్ కలను సాకారం చేసుకునేందుకు ఇదే సరైన టైం అని భావిస్తుంది మిల్కీ బ్యూటి.

అందుకే సౌత్లో ఇప్పటికే అంగీకరించిన సినిమాలకు కూడా నో చెప్తుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవ స్వయంగా నిర్మించి నటించిన అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా,  ఆ తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించింది. అయితే ఆ ప్రాజెక్ట్పై ఎనౌన్స్మెంట్ కూడా వచ్చిన తరువాత ఇప్పుడు తమన్నా నో చెప్పేసిందట. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిన మిల్కీ బ్యూటి, బాలీవుడ్ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement