ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి. తమిళ నాట దేవీ పేరుతో విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్‌ను తెరకెక్కించారు. తొలి భాగంలో నటించిన ప్రభుదేవా, తమన్నాలు మరోసారి జంటగా నటించిన ఈ సినిమాలో మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయంటున్నారు చిత్రయూనిట్.
అంతేకాదు తొలి భాగంలో తమన్నా మాత్రమే దెయ్యంగా కనిపించగా ఈ సీక్వల్‌లో ప్రభుదేవా కూడా దెయ్యంగా కనిపంచనున్నాడు. నందితా శ్వేత మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్ రవీంద్రన్‌ను సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్యామ్ సీయస్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment