'కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు' | Tamannaah said that she knows why Katappa killed Baahubali | Sakshi
Sakshi News home page

'కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు'

Published Mon, Oct 24 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

'కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు'

'కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు'

ముంబై: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకు తెలుసునని అంటోంది హీరోయిన్ తమన్నా. ఈ రహస్యం తెలిసిన కొద్దిమందిలో తాను కూడా ఉన్నానని అంది. ముంబైలో జరిగిన 18వ మియామి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇటీవల 'బాహుబలి' టీమ్ సందడి చేసింది. ప్రతిచోటా అడిగినట్టుగానే ఇక్కడ కూడా 'బాహుబలిని కట్టప్ప చంపాడన్న' ప్రశ్న రాజమౌళి బృందానికి ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం మూడో భాగంలో దొరుకుతుందని హీరో ప్రభాస్ సరదాగా చెప్పాడు.

తనకు ఈ రహస్యం తెలుసునని తమన్నా నిజాయితీగా ఒప్పుకుంది. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిన కొద్దిమంది అదృష్టవంతుల్లో నేను కూడా ఉన్నాను. బాహుబలి- ది బిగినింగ్ సినిమా విడుదలకు ముందురోజు నాకీ సంగతి తెలిసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనని ప్రభాస్, నేను మాట్లాడుకుంటూ.. ఆకస్మత్తుగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అన్నాం. తర్వాత ఈ ప్రశ్న చాలా పాపులర్ అయిపోయింది. ఈ రహస్యం గురించి మాకు మాత్రమే తెలుస'ని తమన్నా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement