‘బాహుబలి’లో అది నా తప్పే! | SS Rajamouli comments on Baahubali Sequel | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’లో అది నా తప్పే!

Published Mon, Oct 24 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

‘బాహుబలి’లో అది నా తప్పే!

‘బాహుబలి’లో అది నా తప్పే!

‘బాహుబలి-2' ఫస్ట్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసిన సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి పలు ఆసక్తికర అంశాలపై ముచ్చటించాడు. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అన్న అంశం ఇంత పెద్ద సెన్సేషన్‌ అవుతుందని తాము ఊహించలేదని చెప్పాడు. రెండో పార్టుపై ఆసక్తిని కొనసాగించడానికే ఈ అంశాన్ని సస్పెన్స్‌గా ఉంచామని తెలిపాడు. "కట్టప్ప ఇంత పాపులర్‌ అవుతున్నాడని మేం ఊహించలేదు. మొదటి భాగానికి  ఇది సరైన ముగింపుగా భావించాం. కానీ ఇది (కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న) ఇంత పెద్ద అంశం అవుతుందని మేం ఊహించలేదు' అని రాజమౌళి వివరించాడు. ఈ విషయంలో ఇంత ఆసక్తిగా నెలకొనడం ఆనందం కలిగిస్తున్నదని చెప్పారు. అదే సమయంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగారా? అంటే లేదని బదులిచ్చారు.

'బాహుబలి' మొదటి పార్టులో రాజమౌళి స్వయంగా అతిథిపాత్రలో కొంతసేపు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, రెండోపార్టులో తనకు నటించే ఉద్దేశం లేదని రాజమౌళి వెల్లడించాడు. "అది (నటించడం) నా పొరపాటే. ఇంకా నేను తప్పులు చేయను' అని రాజమౌళి తెలిపాడు. 'బాహుబలి' మొదటి పార్టును ఆదరించడంతో రెండో పార్టు తీయడం తేలికైందని, ఈ సినిమాను హిందీలో డబ్‌ చేయడంతో దక్షిణాది సినిమాకు బాలీవుడ్‌ కు మధ్య అంతరం తగ్గినట్టు అయిందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement