katappa
-
టీసీఎస్ లో బాహుబలి టైటిల్ ఎవరికి?
ముంబై : బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా బాహుబలి సినిమా ప్రస్తావనే. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో కూడా బాహుబలి, కట్టప్పలకు తగ్గ పాత్రలు ఉన్నాయట. టాటా గ్రూప్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రాతలు ప్రస్తావనకు వచ్చాయి. టీసీఎస్ బోర్డు సభ్యులైన రతన్ టాటా కంపెనీకి బాహుబలి కాగ, ఆయన సన్నిహితుడు ఇషాత్ హుస్సేస్ కట్టప్పగా ఇన్వెస్టర్లు అభివర్ణించారు. సినిమాలో చూపించిన మాదిరిగా రాజుకు, సేవకుడుకు మధ్యనున్న నమ్మకమైన సంబంధం, రతన్ టాటాకు, హుస్సేన్ కు ఉంటుందని కొనియాడారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి టాటా గ్రూప్ లో హఠాత్తు పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా బోర్డు సభ్యులు బయటికి పంపేయడం, ఆ తర్వాత కొత్త చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ ను బోర్డు సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. కొన్ని నెలల పాటు జరిగిన ఈ వివాదంతో టాటా గ్రూప్ పరువు వీధిన పడింది. అయితే తర్వాత తర్వాత పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీర్ఘకాలిక ఇన్నింగ్ కు తాము చంద్రను ఆహ్వానిస్తున్నామని, బొంబై హౌజ్ చెన్నై హౌజ్ గా మారిందంటూ షేర్ హోల్డర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఇషాత్ హుస్సేన్ మీరు కట్టప్ప, రతన్ టాటా బాహుబలి, 2016లో టాటా సన్స్ అధికార ప్రతినిధిగా మీ పాత్రను మీరు ఎంతో బాధ్యతాయుతంగా చేపట్టారని పేర్కొన్నారు. చంద్రశేఖరన్ కు ఎక్కువగా చంద్ర అని గుర్తింపు ఉంది. చంద్రను నియమించి, రతన్ టాటా తన మిషన్ విజయవంతంగా పూర్తిచేసినట్టు మరో ప్రముఖ ఇన్వెస్టర్ ఆశాలత మహేశ్వరి చెప్పారు. కాగ, నిన్న జరిగిన ఈ వార్షిక సాధారణ సమావేశంలో పలు విషయాలపై చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లతో మాట్లాడారు. ఈ సమావేశంలోనే ట్రంప్ విధానాలు ప్రభావం తమపై ఉండదని ఇన్వెస్టర్లకు ధైర్యం చెప్పారు. ట్రంప్ తో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రికి రాజమౌళి రహస్యం చెప్పేశారు
పనాజీ: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా వెంటనే మన చెవులు ఆ వైపు పెట్టాలనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఆ ముచ్చట గురించి చెబుతోంది చిన్న వ్యక్తి కాదు. ఓ కేంద్ర మంత్రి. అవును కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని విషయంపై మాట్లాడారు. ఆ గుప్త రహస్యం తనకు తెలుసని, అది తనకు చెప్పిన దర్శకుడు రాజమౌలికి ధన్యవాదాలు అని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత వెండితెర చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్’ . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత ప్రతిష్టను ఇనుమడింపజేసుకుందో చెప్పనక్లర్లేదు. అయితే అంతే స్థాయిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న కూడా ఫేమస్ అయింది. దీనిపై ఇప్పటికే వేల ఊహాగానాలు జోకులుగా, సీరియస్ కామెంట్లుగా, వివరణలుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా గోవాలో జరుగుతున్న 47 అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి దర్శకుడు రాజమౌళి కూడా ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యవర్ధన్ రాథోడ్‌కు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యం చెప్పారంట. ఈ విషయాన్ని రాథోడ్ స్వయంగా సోమవారం ఈ చిత్రోత్సవానికి ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో వేదికపై నుంచి వెల్లడించారు. ‘బాహుబలిలాంటి బ్రిలియంట్ చిత్రాన్ని మనకు అందించిందనందుకు రాజమౌళికి నా ధన్యవాదాలు. అలాగే బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం కూడా చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఆయన ఎందుకు చెప్పారంటే మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు.. అంతేకాదు దేన్ని రహస్యంగా ఉంచాలో కూడా తెలుసు.. అందువల్ల రాజమౌళి నాకు చెప్పిన ఆ రహస్యం కూడా భద్రంగా ఉంటుంది’ అని రాథోడ్ అన్నారు. -
'కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలుసు'
ముంబై: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకు తెలుసునని అంటోంది హీరోయిన్ తమన్నా. ఈ రహస్యం తెలిసిన కొద్దిమందిలో తాను కూడా ఉన్నానని అంది. ముంబైలో జరిగిన 18వ మియామి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇటీవల 'బాహుబలి' టీమ్ సందడి చేసింది. ప్రతిచోటా అడిగినట్టుగానే ఇక్కడ కూడా 'బాహుబలిని కట్టప్ప చంపాడన్న' ప్రశ్న రాజమౌళి బృందానికి ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం మూడో భాగంలో దొరుకుతుందని హీరో ప్రభాస్ సరదాగా చెప్పాడు. తనకు ఈ రహస్యం తెలుసునని తమన్నా నిజాయితీగా ఒప్పుకుంది. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిన కొద్దిమంది అదృష్టవంతుల్లో నేను కూడా ఉన్నాను. బాహుబలి- ది బిగినింగ్ సినిమా విడుదలకు ముందురోజు నాకీ సంగతి తెలిసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనని ప్రభాస్, నేను మాట్లాడుకుంటూ.. ఆకస్మత్తుగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అన్నాం. తర్వాత ఈ ప్రశ్న చాలా పాపులర్ అయిపోయింది. ఈ రహస్యం గురించి మాకు మాత్రమే తెలుస'ని తమన్నా చెప్పింది. -
‘బాహుబలి’లో అది నా తప్పే!
‘బాహుబలి-2' ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి పలు ఆసక్తికర అంశాలపై ముచ్చటించాడు. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అన్న అంశం ఇంత పెద్ద సెన్సేషన్ అవుతుందని తాము ఊహించలేదని చెప్పాడు. రెండో పార్టుపై ఆసక్తిని కొనసాగించడానికే ఈ అంశాన్ని సస్పెన్స్‌గా ఉంచామని తెలిపాడు. "కట్టప్ప ఇంత పాపులర్ అవుతున్నాడని మేం ఊహించలేదు. మొదటి భాగానికి ఇది సరైన ముగింపుగా భావించాం. కానీ ఇది (కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న) ఇంత పెద్ద అంశం అవుతుందని మేం ఊహించలేదు' అని రాజమౌళి వివరించాడు. ఈ విషయంలో ఇంత ఆసక్తిగా నెలకొనడం ఆనందం కలిగిస్తున్నదని చెప్పారు. అదే సమయంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఎవరైనా సరిగ్గా చెప్పగలిగారా? అంటే లేదని బదులిచ్చారు. 'బాహుబలి' మొదటి పార్టులో రాజమౌళి స్వయంగా అతిథిపాత్రలో కొంతసేపు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, రెండోపార్టులో తనకు నటించే ఉద్దేశం లేదని రాజమౌళి వెల్లడించాడు. "అది (నటించడం) నా పొరపాటే. ఇంకా నేను తప్పులు చేయను' అని రాజమౌళి తెలిపాడు. 'బాహుబలి' మొదటి పార్టును ఆదరించడంతో రెండో పార్టు తీయడం తేలికైందని, ఈ సినిమాను హిందీలో డబ్ చేయడంతో దక్షిణాది సినిమాకు బాలీవుడ్ కు మధ్య అంతరం తగ్గినట్టు అయిందని చెప్పాడు.