సోలో హీరోగా భల్లాలదేవ
బాహుబలి లాంటి భారీ చిత్రంతో నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్న రానా మళ్లీ సోలో హీరోగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 2012లో రిలీజ్ అయిన కృష్ణం వందే జగద్గురుం సినిమా తరువాత సోలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయని రానా త్వరలో సోలోగా సక్సెస్ కొట్టాలని భారీ స్కెచ్ వేస్తున్నాడు.
ప్రస్తుతం బెంగళూర్ డేస్ రీమేక్ లో నటిస్తున్న ఈ మ్యాన్లీ హీరో ఆ సినిమా పూర్తవ్వగానే బాహుబలి 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ రెండు సినిమాలు మల్టీ స్టారర్ లే కావటంతో తరువాత సినిమా సోలోగానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా ఫిక్స్ చేసుకున్న రానా కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు.
లాంగ్ గ్యాప్ తరువాత రానా సోలో హీరోగా తెరకెక్కనున్న సినిమాను కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్లు సాధించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్ట్ చేయనున్నాడు. రానా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు ప్రేమ్ రక్షిత్. ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్లలా ప్రేమ్ రక్షిత్ కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.