prem rakshith
-
రాజమౌళి దంపతులకు ఆస్కార్ నుంచి ఆహ్వానం..
ఆస్కార్.. ఎంతోమంది కలలు గనే ఈ అవార్డు గతేడాది ఇండియన్ సినిమాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ విభాగంలో అకాడమీ పురస్కారం లభించింది. అంతేగాక ఈ సినిమా టీమ్ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు శిరిల్ గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏమ్పీఏఎస్) లో సభ్యత్వం సాధించారు.ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి దంపతులు చేరారు. దర్శకత్వ కేటగిరీలో జక్కన్న, కాస్ట్యూమ్ డిజైనర్ లిస్టులో ఆయన భార్య రమా రాజమౌళి అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది అకాడమీ.. 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆహ్వానం పంపింది. వీరిలో భారత్ నుంచి రాజమౌళి దంపతులతో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, బాలీవుడ్ నటి షబానా అజ్మీ, సినిమాటోగ్రాఫర్ రవి వర్మ, దర్శకనిర్మాత రీమా దాస్, నిర్మాత రితేశ్ సిద్వానీ తదితరులు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ సినిమా(#SSMB29) చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by The Academy (@theacademy) చదవండి: ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్! -
రామ్‌చరణ్ బర్త్‌డే స్పెషల్.. ఆస్కార్ విజేతలకు చిరు సన్మానం
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ బర్త్‌డే మరింత ప్రత్యేకం. ఆస్కార్ విజయంతో పాటు త్వరలోనే చరణ్ తండ్రిగా ప్రమోట్ కానున్నాడు. దీంతో ఈ పుట్టినరోజు ఉపాసన మరింత స్పెషల్‌గా నిర్వహించింది. ఈ పార్టీకి రాజమౌళి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్, కాజల్ అగర్వాల్, అడివి శేష్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని చిరంజీవి ఆస్కార్(నాటు నాటు)విజేతలను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి,నిర్మాత డీవీవీ దానయ్య,సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరలతో పాటు ఆర్ఆర్ఆర్ టీంలోని రమ, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
నేను కొరియోగ్రాఫర్ అంటే రాజమౌళి నమ్మలేదు: ప్రేమ్ రక్షిత్
నాటు నాటు పాట చిలక్కొట్టుడుగా కాదు చితక్కొట్టే రేంజ్లో ఉంది. అందుకే ఆ మాస్ పాటకు క్లాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఏకంగా ఆస్కార్ కూడా హాలీవుడ్ పాటలను వెనక్కు నెట్టి తెలుగు పాట ఒడిలో చేరింది. ఈ సాంగ్‌కు అకాడమీ అవార్డు రావడానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కారణమని అందరికీ తెలిసిందే! అయితే ఈ పాట ఇంత అందంగా ఉండటానికి, అందరికీ దగ్గరవ్వడానికి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ముఖ్య కారణమని కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఇటీవలే నొక్కి మరీ చెప్పాడు. కానీ ప్రేమ్ ఓ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని రాజమౌళి మొదట్లో నమ్మలేదట! ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం.. మొదట్లో ప్రేమ్ టైలర్ షాపులో పని చేశాడు. ఆ తర్వాత కొరియోగ్రఫీ ట్రై చేశాడు. చిన్నాచితకా సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూ రాజమౌళి ఇంట్లో పిల్లలకు డ్యాన్స్ నేర్పించేవాడు. కానీ తనొక డ్యాన్స్ మాస్టర్ అన్న విషయాన్ని చాలాకాలం వరకు రాజమౌళికి చెప్పలేదట ప్రేమ్. ఈ విషయం గురించి తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'నేను రాజమౌళి ఇంటికి వెళ్లి పిల్లలకు క్లాస్ తీసుకునేవాడిని. వాళ్లిచ్చిన డబ్బులతో అటు అమ్మానాన్నలకు, ఇటు నాకు పూట గడిచేది. అక్కడ వాళ్లు అద్దె కట్టుకుంటే, ఇక్కడ నేను కూడా నా ఇంటి అద్దె కట్టుకునేవాడిని. నా తమ్ముడిని చదివించేవాడిని. అయితే నేను కొరియోగ్రాఫర్ అని రాజమౌళికి తెలియదు. ఆ విషయం చెప్తే ఎక్కడ నన్ను పనిలోంచి తీసేస్తాడో, అఫీషియల్‌గా కేవలం ఆఫీసులోనే కలుస్తారోనని ఎన్నడూ ఓపెన్ అవ్వలేదు. రాజమౌళి సతీమణి రమా మేడమ్.. దోశలు వేసి ఆప్యాయంగా అడిగి మరీ వేసేది. వాళ్లింటికి వెళ్తే నాకు కడుపు నిండా భోజనం దొరికేది. ఒకరోజు రాజమౌళి ఇంట్లో విద్యార్థి సినిమాలోని పాట ప్లే అవుతూ ఉంది. ఎవరో బాగా చేశారు అని ఆయన అన్నారు. అది విన్నాక నా మనసు ఆగలేదు. నేనే సర్ కొరియోగ్రఫీ చేశానని చెప్పాను. ఆయన నేనేదో జోక్ చేస్తున్నాడుకున్నాడో ఏమో కానీ నువ్వు చేశావా? వెళ్లెళ్లు అంటూ అపనమ్మకంగా మాట్లాడారు. నిజంగా నేనే చేశాను సర్ అని నమ్మించేందుకు ప్రయత్నించడంతో ఆయన ఫోన్ చేసి కనుక్కున్నారు. అప్పుడు ఆయనకు నిజం తెలిసింది. ఎందుకు మాస్టర్, ఇన్నాళ్లూ చెప్పలేదని ప్రశ్నించారు. మీకు నిజం తెలిస్తే నా పని పోతుంది, కుటుంబ పోషణ కష్టమవుతుంది సర్ అని వివరించాను. ఆ తర్వాత రాజమౌళి సర్ చేసిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ.. ఆర్ఆర్ఆర్ వరకు పలు సినిమాలకు పని చేశాను అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ప్రేమ్ రక్షిత్
-
అలా అస్సలు ఊహించలేదు.. కన్నీళ్లు వచ్చేశాయి: ప్రేమ్ రక్షిత్
తాను కొరియోగ్రఫీ చేసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడం ఆనందంగా ఉందని కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆయన..తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆస్కార్ వేడుకలకు వెళ్తానని అస్సలు ఊహించలేదన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సపోర్ట్‌తోనే తాను లాస్ ఏంజెల్స్ వెళ్లగలిగానన్నారు. ‘లాస్ ఏంజెల్స్ వెళ్లగానే నాటు నాటు రిహార్సల్స్‌లో పాల్గొన్నాను. ఆస్కార్ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్న వారంతా లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అవార్డు తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను’అని ప్రేమ్ రక్షిత్ అన్నారు. కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్ ప్రదానోత్సవంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Oscar Naatu Naatu: నాటునాటు ప్రేమ్‌రక్షిత్.. నాటి నుంచి నేటివరకు (అరుదైన ఫోటోలు)
-
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్‌కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్‌చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
రూ.50 వేల కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆస్కార్ అందుకున్నాడు
అందరూ ఊహించనట్టే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో తొలిసారి ఇండియన్ మూవీకి ఆస్కార్ రావడం..అదీ అచ్చ తెలుగు పాట కావడం నిజంగా మనందరికి ఎంతో గర్వకారణం. సినిమాలో నాలుగున్నర నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ పాట కోసం చంద్రబోస్ కొన్ని నెలల పాటు కష్టపడి సాహిత్యం అందించగా.. కీరవాణి అదిరిపోయే సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా ఆలపించారు. అయితే ఈ పాట ఆస్కార్ స్థాయికి వెళ్లడం వెనక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా కీలక పాత్ర వహించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేయడం వల్లే ఈ పాట మరింత ఫేమస్ అయింది. ఇద్దరి స్టార్ హీరోలతో అలాంటి స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఓ గొప్ప కొరియోగ్రాఫర్. కానీ ఒకప్పుడు మాత్రం టైలర్ షాపులో పనివాడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరాడు. ప్రేమ్ రక్షిత్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి. 1993లో కుటుంబ విబేధాల కారణంగా ఆయన ఆస్తులు పోయాయి. వ్యాపారం మానేసి సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్ గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్‌ని టైలర్ షాప్‌లో పని చేశాడట. డ్యాన్స్‌పై ఇంట్రస్ట్ ఉండడంతో సినిమా ప్రయత్నాలు చేశాడు. టైలర్ షాపులో పని చేస్తూనే.. కొరియోగ్రఫీగా ట్రై చేశాడు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. మరోవైపు అప్పులు పెరిగిపోయాయి. దీంతో కుటుంబాన్ని పోషించడం తన వల్ల కాదని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. తాను చనిపోతే డ్యాన్స్ ఫెడరేషన్ వాళ్ళు తన కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తారనీ.. దానితో కుటుంబానికి కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని అతని ఆలోచన. ఒకరోజు పక్కింటి వారి నుంచి సైకిల్ అరువు తెచ్చుకొని మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అక్కడే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే సైకిల్ ఓనర్ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడని భావించి.. అది ఇచ్చేసి వచ్చి చనిపోవాలనుకున్నాడట. అలా ఇంటికి వెళ్లగానే.. సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని తండ్రి చెప్పాడట. దాంతో తన కష్టాలు తీరిపోయాయని.. ప్రేమ్ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడట. ఆ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు. -
బాత్రూమ్లోకి వెళ్లి గంటన్నర ఏడ్చా: నాటు నాటు కొరియోగ్రాఫర్
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో నాటు హిట్ కొట్టింది. సినిమానే కాదు అందులోని పాటలూ విదేశీయులతో ఈలలు కొట్టించేలా చేశాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే నాటునాటు బెస్ట్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడు. హుక్ స్టెప్ కోసం 50 రకాల మూవ్మెంట్స్ సిద్ధం చేస్తే డైరెక్టర్‌కు ఇప్పుడున్నది నచ్చింది. చరణ్, తారక్ ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు తీసుకున్నారు. ఎట్టకేలకు నాటునాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పుడు కొద్దిక్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వాష్‌రూమ్‌లోకి వెళ్లి గంటన్నరపాటు ఏకధాటిగా ఏడ్చాను. రాజమౌళి సర్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. తారక్ అన్నయ్య, చరణ్ సర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. కీరవాణి సర్ అందించిన సంగీతంతో ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. ఫుల్ ఎనర్జీతో సాగే ఈ డ్యాన్స్ రిహార్సల్స్‌లో హీరోలు కాసేపు కూడా బ్రేక్ తీసుకునేవారే కాదు. మంచి స్టెప్స్ డిజైన్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. వాటిని పర్ఫెక్ట్గా చేయాలన్న కసితో హీరోలు 20 రోజులు రిహార్సల్స్ చేశారు. ప్యాకప్ చెప్పేశాక రాజమౌళి సర్ మాతో కలిసి ఆ స్టెప్ నేర్చుకునేవారు. మేము పొద్దున ఆరింటికి లేచి రాత్రి పదింటికి పడుకునేవాళ్లం. ఈ సినిమా కోసం అందరం ఎంతగానో కష్టపడ్డాం' అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్. చదవండి: నాటు నాటు సాంగ్‌కు మరో అవార్డ్, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
సోలో హీరోగా భల్లాలదేవ
బాహుబలి లాంటి భారీ చిత్రంతో నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్న రానా మళ్లీ సోలో హీరోగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 2012లో రిలీజ్ అయిన కృష్ణం వందే జగద్గురుం సినిమా తరువాత సోలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయని రానా త్వరలో సోలోగా సక్సెస్ కొట్టాలని భారీ స్కెచ్ వేస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూర్ డేస్ రీమేక్ లో నటిస్తున్న ఈ మ్యాన్లీ హీరో ఆ సినిమా పూర్తవ్వగానే బాహుబలి 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ రెండు సినిమాలు మల్టీ స్టారర్ లే కావటంతో తరువాత సినిమా సోలోగానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా ఫిక్స్ చేసుకున్న రానా కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రానా సోలో హీరోగా తెరకెక్కనున్న సినిమాను కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్లు సాధించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్ట్ చేయనున్నాడు. రానా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు ప్రేమ్ రక్షిత్. ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్లలా ప్రేమ్ రక్షిత్ కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.