ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో నాటు హిట్ కొట్టింది. సినిమానే కాదు అందులోని పాటలూ విదేశీయులతో ఈలలు కొట్టించేలా చేశాయి. మరీ ముఖ్యంగా నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల్ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే నాటునాటు బెస్ట్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడు. హుక్ స్టెప్ కోసం 50 రకాల మూవ్‌మెంట్స్ సిద్ధం చేస్తే డైరెక్టర్‌కు ఇప్పుడున్నది నచ్చింది. చరణ్, తారక్ ఇద్దరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే అయినా పర్‌ఫెక్ట్ సింక్ కోసం దాదాపు 46 రీటేకులు తీసుకున్నారు. ఎట్టకేలకు నాటునాటు పాట అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పుడు కొద్దిక్షణాలపాటు నాకేమీ అర్థం కాలేదు. వాష్‌రూమ్‌లోకి వెళ్లి గంటన్నరపాటు ఏకధాటిగా ఏడ్చాను. రాజమౌళి సర్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. తారక్ అన్నయ్య, చరణ్ సర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. కీరవాణి సర్ అందించిన సంగీతంతో ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. ఫుల్ ఎనర్జీతో సాగే ఈ డ్యాన్స్ రిహార్సల్స్‌లో హీరోలు కాసేపు కూడా బ్రేక్ తీసుకునేవారే కాదు. మంచి స్టెప్స్ డిజైన్ చేయడానికి నాకు రెండు నెలలు పట్టింది. వాటిని పర్‌ఫెక్ట్‌గా చేయాలన్న కసితో హీరోలు 20 రోజులు రిహార్సల్స్ చేశారు. ప్యాకప్ చెప్పేశాక రాజమౌళి సర్ మాతో కలిసి ఆ స్టెప్ నేర్చుకునేవారు. మేము పొద్దున ఆరింటికి లేచి రాత్రి పదింటికి పడుకునేవాళ్లం. ఈ సినిమా కోసం అందరం ఎంతగానో కష్టపడ్డాం' అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్.
చదవండి: నాటు నాటు సాంగ్‌కు మరో అవార్డ్, ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్
రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
Comments
Please login to add a commentAdd a comment