Natu Natu Choreographer Prem Rakshith Emotional Comments On Oscar Win, Deets Inside - Sakshi
Sakshi News home page

Prem Rakshith: ఆ క్షణం కన్నీళ్లు వచ్చేశాయి.. ‘నాటు నాటు’ కొరియోగ్రాఫర్‌

Published Wed, Mar 15 2023 1:08 PM | Last Updated on Wed, Mar 15 2023 1:45 PM

Natu Natu Choreographer Prem Rakshith Comments On OScars 2023 - Sakshi

తాను కొరియోగ్రఫీ చేసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ లభించడం ఆనందంగా ఉందని కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ అన్నారు. ఆస్కార్‌ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆయన..తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆస్కార్‌ వేడుకలకు వెళ్తానని అస్సలు  ఊహించలేదన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ సపోర్ట్‌తోనే తాను లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లగలిగానన్నారు.

‘లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లగానే నాటు నాటు రిహార్సల్స్‌లో పాల్గొన్నాను. ఆస్కార్‌ వేడుకల్లో స్టేజ్‌పై ఆ పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్న వారంతా లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అవార్డు తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను’అని ప్రేమ్‌ రక్షిత్‌ అన్నారు.

కాగా, ఈనెల 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలు)లాజ్‌ ఏంజిల్‌లో జరిగిన 95వ ఆస్కార్‌ ప్రదానోత్సవంలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు(ఆర్‌ఆర్‌ఆర్‌)’ పాటకు అస్కార్‌ లభించింది. అలాగే బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement