Vijay Deverakonda Cheers At Ind Vs Aus 3rd T20 Cricket Match In Uppal, Video Viral - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ఉప్పల్‌ మ్యాచ్‌లో లైగర్.. సోనూ సూద్‌తో కలిసి సందడి

Published Tue, Sep 27 2022 3:58 PM | Last Updated on Tue, Sep 27 2022 4:33 PM

Vijay Deverakonda Cheers At  India Cricket T20 Match  in Hyderabad - Sakshi

భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీనటులు కూడా మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు సందడి చేశారు.  సోనూ సూద్‌తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్‌ను తిలకించారు. విజయ్ తమ్ముడు ఆనంద్‌ కూడా ఉప్పల్‌  మ్యాచ్‌ను వీక్షించారు. వీరంతా టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ఇటీవల థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ బాక‍్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూాడ నటుడే. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న వీడియో క్లిప్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస‍్టులో దుబాయ్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2022 ఆసియా కప్ మ్యాచ్‌లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement