
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గతేడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో అన్న విజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. తమ్మునితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. నాతో ఫైట్ చేసే మొదటి అబ్బాయికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
Happiest Birthday to the first boy I’ll take with me on a fight 😄❤️
Brother boy @ananddeverkonda
I love you most 😘 pic.twitter.com/Yg2ZisFuE2— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2024