ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Rashmika Comments In Gam Gam Ganesha Pre Release Event | Sakshi
Sakshi News home page

Rashmika: రష్మికని ఓ ఆటాడుకున్న ఆనంద్ దేవరకొండ

Published Tue, May 28 2024 7:53 AM | Last Updated on Tue, May 28 2024 8:50 AM

Rashmika Comments In Gam Gam Ganesha Pre Release Event

రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది. విజయ్‌తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‍‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్‌గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.

నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్‌ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement