థ్యాంక్యూ జాకీ : సోనూసూద్ | sonusood thanked jackie chan for dinner party | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ జాకీ : సోనూసూద్

Oct 3 2015 10:39 AM | Updated on Sep 3 2017 10:23 AM

థ్యాంక్యూ జాకీ : సోనూసూద్

థ్యాంక్యూ జాకీ : సోనూసూద్

బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు అంతర్జాతీయ సినీ అభిమానులకు దగ్గరవుతున్నాడు. చాలా రోజులుగా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించటం మానేసిన సోనూ, ఇటీవల తన నెక్ట్స్ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.

బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు అంతర్జాతీయ సినీ అభిమానులకు దగ్గరవుతున్నాడు. చాలా రోజులుగా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించటం మానేసిన సోనూ, ఇటీవల తన తదుపరి సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.

జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ మూవీ 'కుంగ్ ఫూ యోగ'లో కీలకపాత్రలో సోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న యూనిట్ సభ్యులకు జాకీచాన్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఈ విషయన్ని ట్విట్టర్లో తన అభిమానులతో షేర్ చేసుకున్న సోనూసూద్, జాకీచాన్కి కృతజ్ఞతలు తెలియజేశాడు.

దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకుడు. దుబాయ్, బీజింగ్లతో పాటు, ఇండియాలోనూ కొంత భాగాన్ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement