పంజాబీ పాటకు హాలీవుడ్ హీరో డ్యాన్స్ | Jackie Chan, Sonu Sood dancing on Daler Mehndi song | Sakshi
Sakshi News home page

పంజాబీ పాటకు హాలీవుడ్ హీరో డ్యాన్స్

Published Tue, Jun 14 2016 12:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

పంజాబీ పాటకు హాలీవుడ్ హీరో డ్యాన్స్

పంజాబీ పాటకు హాలీవుడ్ హీరో డ్యాన్స్

హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్, బాలీవుడ్ హంక్ సోనూసూద్ కలిసి నటిస్తున్న హాలీవుడ్ సినిమా కుంగ్ఫూ యోగా. ఈ సినిమా చైనాతో పాటు భారతీయతకు సంబందించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో ఓ ప్రధాన పాత్రకు సోనూసూద్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలు వీడియో మీడియాలో హల్ చల్ చేస్తుండగా తాజాగా సోనూసూద్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇటీవల చైనాలోని షాంగైలో జరిగిన షాంగై ఫిలిం ఫెస్టివల్కు హాజరైన జాకీచాన్, సోనూసూద్లు స్టేజ్ పై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. అది కూడా ఇండియన్ పంజాబీ సింగర్ దలెర్ మెహంది పాడిన ఫేమస్ సాంగ్ తునక్ తునక్ తున్ తానా నా.. పాటకు స్టెప్పులేశారు. కుంగ్ ఫూ యోగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన జాకీ, సోనూలు తమ డ్యాన్స్ లతో ఈవెంట్ కే హైలెట్ గా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement