
సోనూకి జాకీచాన్ న్యూ ఇయర్ గిఫ్ట్
యూనివర్సల్ స్టార్ జాకీచాన్, భారతీయ నటుడు సోనూసూద్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు స్టార్లు ప్రస్తుతం కుంగ్ఫూ యోగా సినిమాలో కలిసి నటిస్తున్నారు. చైనాతో పాటు భారతీయతకు సంబంధించిన సినిమా కావటంతో ఓ ప్రధాన పాత్రకు సోనూసూద్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేస్తుండగా తాజాగా సోనూసూద్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
న్యూ ఇయర్ సందర్భంగా సోనూసూద్కు శుభాకాంక్షలు తెలియజేసిన జాకీచాన్ వైట్ కలర్ జాకెట్ను సోనూకు గిప్ట్గా ఇచ్చాడు. జాకీచాన్ లాంటి టాప్ స్టార్ గిఫ్ట్ ఇవ్వటంతో సోనూసూద్ ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కుంగ్ఫూ యోగా ఈ ఏడాది చివరలో రిలీజ్ కానుంది.
N the New Year Begins with my bro #jackiechan ..thank u for this lovely jacket #Beijing #kungfuyoga pic.twitter.com/N6sGxiVUQk
— sonu sood (@SonuSood) January 2, 2016