రిపబ్లిక్ డే వర్ణాలు...
జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం. న్యూఢిల్లీ రాజ్‌పథ్‌లో సైనిక విన్యాసాలు, రాష్ట్రాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థుల నృత్యాలు... చూడటానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం అక్కడ డ్రస్ రిహార్సల్స్ జరిగాయి. పిల్లలు ఉత్సాహంగా నృత్యం చేస్తున్న ఫొటో ఇది.
ఖైదీ నృత్యం
ఈ ఫొటోలో ఉత్సాహంగా నృత్యం చేస్తున్నది డాన్సర్లు కాదు. జబల్‌పూర్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్ జైల్‌లో ఉన్న మహిళా ఖైదీలు. నిన్న నేతాజీ జయంతి సందర్భంగా జైలులో వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలను ఉల్లాసభరితం చేయడానికి మహిళా ఖైదీలు ఇలా నృత్యాలు చేశారు.
చాన్ ఇన్ ముంబై...
జాకీచాన్ అంటే తెలియనిది ఎవరికి? భారతీయ నటులతో చైనా– భారత్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమైన ‘కుంగ్‌ఫూ యోగా’లో జాకీచాన్ హీరో. అతడితో పాటుగా మన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం నిన్న జాకీచాన్ ముంబై చేరుకున్నాడు. అభిమానులంతా తమ హీరోని చూసి పులకించిపోయారు.
క్లిక్.. క్లిక్...
Published Mon, Jan 23 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
Advertisement
Advertisement