అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్ | Jackie Chan Endorses Tamannah Film | Sakshi
Sakshi News home page

అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్

Published Sun, Jul 31 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్

అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్

తమన్నా లీడ్ రోల్లో ప్రభుదేవా, సోనూసూద్లు ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభినేత్రి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తమిళంలో డెవిల్ పేరుతో, హిందీలో టూ ఇన్ వన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ను ప్రభుదేవా, హిందీ వర్షన్ను సోనూసూద్లు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్, కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ ప్రమోషన్ ప్రారంభించిన సోనూ, పోస్టర్ లాంచ్కు ఏకంగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ను ఆహ్వానించాడు. ప్రస్తుతం జాకీతో కలిసి కుంగ్ ఫూ యోగా అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు సోనూ. ఆ అనుబంధంతోనే సోనూసూద్ నిర్మించిన తొలి సినిమా పోస్టర్ను లాంచ్ చేశాడు జాకీ.

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న అభినేత్రి హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ప్రభుదేవా,
సోనూసూద్లు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అభినేత్రి సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement