
'శాంటాను కలిసినంత ఆనందంగా ఉంది'
తెలుగు సినిమాతో వెండితెర మీదకు అడుగుపెట్టిన దిశాపటానీ.. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందట. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దిశా. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అనుకోకుండా వచ్చిన హాలీవుడ్ ఆఫర్ మాత్రం ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.
జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న 'కుంగ్ఫూ యోగా' సినిమాలో దిశపటానీ ఓ ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది. మరో భారతీయ నటుడు సోనుసూద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సోనూ, జాకీ చాన్ తన మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్న దిశా.. ఇప్పుడు జాకీని ఏకంగా శాంటాతో పోల్చింది. తనను షూటింగ్ సమయంలో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న జాకీచాన్ను పొగడటానికి శాంటా అనే పదం చాలదంటూ కామెంట్ చేసింది.
'నా గురించి ఎంతో కేర్ తీసుకుంటున్న స్వచ్ఛమైన మనిషికి కృతజ్ఞతలు. నువ్వు ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటావు. చాలా మందికి నువ్వు జాకీచాన్ గానే తెలుసు, కానీ నువ్వు ఎంత గొప్పవాడివో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుంది. ఎంతో గొప్పగా ప్రేమించే వ్యక్తితో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శాంటా నన్ను కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత కన్నా ఎక్కువ. నీ గురించి చెప్పడానికి శాంటా అన్న పదం చాలదు'. అంటూ జాకీచాన్ను ఆకాశానికి ఎత్తేసింది దిశాపటాని.
Thank you to the most pure soul on this planet for taking so much care of me !! You are and you… https://t.co/wnH9yTQTWo
— disha patani (@DishPatani) March 7, 2016