![Sonu Sood Got Odisha Times Business Awards Orissa - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/30/Untitled-1.jpg.webp?itok=B7cCltpn)
పర్లాకిమిడి(భువనేశ్వర్): కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది వలస కార్మికులకు సహాయం చేసిన బాలీవుడ్ హీరో సోనూసూద్ ఒడిశాలో టైమ్స్ బిజినెస్ ఆవార్డును హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి చేతుల మీదుగా ఆదివారం అందుకున్నారు. కార్యక్రమానికి ఒడిశా ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి విశాల్ దేవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి మనోజ్ కుమార్ మిశ్రా, ఒడిశా ఆర్సలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా డైరెక్టర్ టి.ఎస్.షన్‌బోగే తదితరులు హాజరయ్యారు. అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ సోనూసూద్‌ను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment