న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస‍్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడికి ప్రయత్నాలు ఫలించడం లేదు. దేశంలో మరోసారి నాలుగు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,76,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌లోనే 49 శాతం కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో కొత్తగా 5,892 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాంగా 46 మంది మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,104 కరోనా కేసులు, రంగారెడ్డిలో 443, మేడ్చల్ లో 378, నల్లగొండలో 323 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,81,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 4,05,164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 2,625 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment