హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా కన్నుమూత | Former Haryana Chief Minister And INLD Leader Om Prakash Chautala Dies At 89 In Gurugram Home | Sakshi
Sakshi News home page

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా కన్నుమూత

Published Fri, Dec 20 2024 12:40 PM | Last Updated on Fri, Dec 20 2024 2:47 PM

Former Haryana Chief Minister Om Prakash Chautala dies at 89

చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం గురుగ్రామ్‌లోని తన నివాసంలో మరణించారు.

దేశానికి 6వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో చౌతాలాలో జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చివరి పదవీకాలం 1999 నుండి 2005 వరకు కొనసాగింది.

ఆరురోజుల సీఎం
ఓం ప్రకాశ్‌ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.

టీచర్ల నియామకాల్లో అవినీతి.. పదేళ్లు జైలు శిక్ష
హర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలు సంపాదించుకున్న ఓం ప్రకాష్‌ చౌతాలా రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో సహా  పలు కేసుల్లో జైలు జీవితాన్ని గడిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలా పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. 

2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో  చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.

ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

అయితే కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసిన వారికి  6నెలలు మినహాయింపును ఇచ్చింది.  ప్రభుత్వం  నిర్ణయంతో ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఆరు నెలల మినహాయింపు లభించింది. దీంతో ఆయన జైలు నుంచి  విడుదలయ్యారు.  

 

అక్రమ ఆస్తుల కేసులో
అక్రమ ఆస్తుల కేసులో హర్యానా  మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది.

హర్యానా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది.

పదో తరగతి ఫెయిల్‌
చౌతాలా పదో తరగతిలో ఇంగ్లీష్‌ సబ్జెట్‌లో ఫెయిలయ్యారు. దీంతో చదువుకు పులిస్టాప్‌ పెట్టారు. అయితే లేటు వయస్సులో పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. 2021లో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యారు.  విచిత్రం ఏంటంటే? చౌతాలా అక్రమాస్తుల కేసులో తీహార్‌ జైలులో శిక్షను అనుభవించారు. ఆ సమయంలో పదోతరగతి పాస్‌ అవ్వకుండానే  కరోనా తొలి దశలో ఓపెన్‌ స్కూల్‌లో చౌతలా ఇంటర్మీడియట్‌లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్‌ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన పదో తరగతి ఇంగీష్‌  పరీక్ష రాశారు. విడుదలైన ఫలితాల్లో  100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు.

తీహార్‌ జైల్లో.. ఫస్ట్‌ క్లాస్‌లో ఇంటర్‌ పాస్‌
సుప్రీం కోర్టు తీర్పుతో తీహార్‌ జైలులో శిక్ష అనుభవించే చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే 82 ఏళ్ల వయసులో చౌతాలా ఇంటర్ చదివారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఇంటర్‌లో పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement