Neha Sharma Buys Swanky New Mercedes Car Worth Rs 1.09 Crore, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Neha Sharma: లగ్జరీ కారు కొన్న చిరుత ఫేమ్ నేహా శర్మ.. ధర ఎన్ని కోట్లంటే?

Published Tue, Apr 4 2023 5:47 PM | Last Updated on Tue, Apr 4 2023 6:07 PM

Neha Sharma buys swanky new Mercedes car worth rs1.09 crore - Sakshi

బాలీవుడ్ నటి నేహా శర్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో క్రూక్‌ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత వరుసగా యమ్లా పగ్లా దీవానా 2, సోలో, తాన్హాజీతో సహా పలు చిత్రాలలో నేహా శర్మ కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది బాలీవుడ్  ముద్దుగుమ్మ. కొత్త కారుకు వెల్‌కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మ ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది.  నేహా శర్మ దాదాపు రూ.1.09 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. 

(ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్)

నేహా తన ట్విటర్‌లో రాస్తూ..'మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం. భగవంతుడు మనపట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వారి పెంపుడు కుక్కతో కలిసి తన కొత్త కారును ఇంటికి స్వాగతించారు. కొత్త కారుకు కొబ్బరికాయ కొట్టేందుకు నేహా శర్మ, చెల్లెలు ఐషా శర్మ ఇబ్బంది పడ్డారు. 

కాగా.. నేహా 'క్రూక్', 'క్యా సూపర్ కూల్ హై హమ్', 'యమ్లా పగ్లా దీవానా 2', 'యంగీస్తాన్', 'తుమ్ బిన్ 2', 'తాన్హాజీ' వంటి అనేక చిత్రాలలో నటించింది. త్వరలోనే  నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'జోగిరా సారా రా' చిత్రంలో నటించనుంది. ఇందులో సంజయ్ మిశ్రా, మహాఅక్షయ్ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement