లగ్జరీ కారు కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్.. ధర ఎన్ని కోట్లంటే? | Rakul Preet Singh Buys A Brand New Mercedes-Benz GLS Mercedes-Maybach; Video Viral - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: కొత్త కారు ముందు పోజులు.. స్వీట్లు పంచిన ముద్దుగుమ్మ!

Published Fri, Sep 8 2023 7:53 PM | Last Updated on Sat, Sep 9 2023 9:28 AM

Rakul Preet Singh Buys Mrercedez Benz Swanky Car Goes Viral - Sakshi

రకుల్ ప్రీత్ సింగ్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్‌వే 34', 'కట్‌ పుట్లి, 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. తెలుగులోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన నటించింది.

(ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్‌ చేసిన శ్రీవల్లి!)

టాలీవుడ్‌లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం. 

తాజాగా ఈ ముద్దుగమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది భామ. అంతేకాకుండా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ లగ్జరీ బెంజ్‌ కారు విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

(ఇది చదవండి: హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement