తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ | Tamil Actress Parvathy Nair Police Case Latest | Sakshi
Sakshi News home page

Parvathy Nair: ఈమెతో సహా మొత్తం ఐదుగురిపై కేసు

Published Sun, Sep 22 2024 8:18 AM | Last Updated on Sun, Sep 22 2024 8:58 AM

Tamil Actress Parvathy Nair Police Case Latest

రీసెంట్‌గా దళపతి విజయ్ 'ద గోట్' మూవీతో వచ్చాడు. ఇందులో కీలక పాత్రలో నటించిన పార్వతి నాయర్‌పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్వతి, మరో నిర్మాత సహా మొత్తంగా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?
2022 అక్టోబరు 20న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పార్వతి నాయర్ నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తన దగ్గర పనిచేసే సుభాష్ చంద్రబోస్.. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లక్షన్నర ఖరీదైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిగా ఈమెపై సుభాష్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. పార్వతి నాయర్.. తనని కొట్టి, మానసిక క్షోభకు గురిచేసిందని, తిరిగి దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు.

(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)

ఇప్పుడేం జరిగింది?
అప్పుడు సుభాష్.. తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తాజాగా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనని ఇబ్బంది పెట్టారని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది.

ఈ క్రమంలోనే నటి పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దుబాయిలో పుట్టి పెరిగిన పార్వతి నాయర్.. మలయాళ సినిమాలతో నటి అయింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో చేయనప్పటికీ ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ద గోట్ చిత్రాలతో అలరించింది.

(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్‌.. ప్రైజ్‌మనీ డబుల్‌! అభయ్‌, మణికి వార్నింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement