Parvathy Nair
-
తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ
రీసెంట్గా దళపతి విజయ్ 'ద గోట్' మూవీతో వచ్చాడు. ఇందులో కీలక పాత్రలో నటించిన పార్వతి నాయర్‌పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్వతి, మరో నిర్మాత సహా మొత్తంగా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగింది?2022 అక్టోబరు 20న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పార్వతి నాయర్ నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తన దగ్గర పనిచేసే సుభాష్ చంద్రబోస్.. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లక్షన్నర ఖరీదైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిగా ఈమెపై సుభాష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పార్వతి నాయర్.. తనని కొట్టి, మానసిక క్షోభకు గురిచేసిందని, తిరిగి దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు.(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)ఇప్పుడేం జరిగింది?అప్పుడు సుభాష్.. తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తాజాగా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనని ఇబ్బంది పెట్టారని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది.ఈ క్రమంలోనే నటి పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దుబాయిలో పుట్టి పెరిగిన పార్వతి నాయర్.. మలయాళ సినిమాలతో నటి అయింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో చేయనప్పటికీ ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ద గోట్ చిత్రాలతో అలరించింది.(ఇదీ చదవండి: కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్) -
అవి స్వార్థ రాజకీయాలు : నటి
సాక్షి, సినిమా: అవి స్వార్థ రాజకీయాలే నంటోంది నటి పార్వతీనాయర్. కోలీవుడ్‌లో ఎన్నై అరిందాల్, ఉత్తమవిలన్ చిత్రాల్లో నటించిన మలయాళీ బ్యూటీ ఈ అమ్మడు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీ అందాలారబోతలోనూ జాణే. అయితే ఇప్పటికీ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న పార్వతీనాయర్ ప్రస్తుతం మాతృభాషలో మోహన్‌లాల్‌కు జంటగా నీరవీ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడితో చిట్‌చాట్. ఇంతకుముందు కమలహాసన్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించారు. ఇప్పుడు మోహన్‌లాల్‌తో నటిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు? నేను స్టార్ హీరోలతోనే నటిస్తాను. యువ హీరోలతో నటించను అని ఎప్పుడూ అనలేదు. ఇటీవల వర్థమాన హీరోలతో కూడా నటించాను. నా పాత్ర బాగుందనిపిస్తే నటించడానికి నేనుప్పుడూ రెడీనే. ఎలాంటి కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నారు? మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. నాలోని ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం రాలేదు. నేను చాలా సరదాగా ఉండే అమ్మాయిని. అయితే చిత్రాల్లో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. మీరు కమలహాసన్‌తో కలిసి నటించారు. ఆయనిప్పుడు రాజకీయ పార్టీని ప్రారంభించారు. అందులో చేరే అవకాశం ఉందా? నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అయితే రాజకీయపరమైన పుస్తకాలను చదువుతుంటా. ఇంకా కొంత కాలం తరువాతనే రాజకీయం, దాని గురించి అభిప్రాయాలు చెప్పలగను. ఇక రాజకీయాల్లో ఎవరికి మద్దతు అన్న విషయం గురించి ఇంకా అలోచించలేదు. అయితే ప్రజలకు నిజాయితీగా సేవ చేసే నాయకుడికే మద్దతిస్తాను. తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజలకు దగ్గరయిన మీరు ఈ మూడు రాష్ట్రాల్లో రగులుతున్న నీటి సమస్య గురించి ఎలా స్పందిస్తారు? కావేరి నీటి సమస్య గురించి వార్తలు చదువుతున్నాను. అయితే దీనికి పరిష్కారం చెప్పే స్థాయి నాది కాదు. అయితే ఇది పూర్తిగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఆడే పెద్ద నాటకం అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రాల ఎల్లలు దాటి ప్రజలు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అలాంటిది నీటిని ఇవ్వడానికి ప్రజలెవ్వరూ అభ్యంతరం చెప్పరు. మీ రోల్ మోడల్ ఎవరు? నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటాను. అయితే నటి మాధురిదీక్షిత్, శోభనలను రోల్‌మోడల్‌గా తీసుకుంటాను. నచ్చిన హీరో, హీరోయిన్? అజిత్. ఆయనంటే ఇంతకుముందే ఇష్టం. ఇప్పుడు ఇంకా ఇష్టం. నచ్చిన హీరోయిన్ నయనతార. -
హీరోయిన్గా పార్వతీ నాయర్
ఎన్నై అరిందాల్, ఉత్తమ విలన్ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన నటి పార్వతీనాయర్‌కు కోలీవుడ్‌లో హీరోయిన్గా ప్రమోషన్ వచ్చింది. ఎన్‌కిట్ట మోదాదే చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. చతురంగవేట్టై, కదం కదం చిత్రాల నటుడు నటరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎన్‌కిట్ట మోదాదే. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి పార్వతీ నాయర్ తెలుపుతూ ఈ చిత్రంలో తన పాత్ర గురించి తెలియగానే చాలా ఆనందం కలిగిందని అంది. తన పాత్ర గురించి దర్శకుడు ఇప్పుడే బయట ఎక్కడా చెప్పొద్దని నిబంధన విధించారు కాబట్టి తానేమి చెప్పలేనని పేర్కొంది. అయితే ఇలాంటి పాత్ర ఇంతకుముందే తమిళ తెరపై రాలేదని మాత్రం చెప్పగలనని అంది. ఈ చిత్రంలో పార్వతీనాయర్తో పాటు సూదుకవ్వుం చిత్రం ఫేమ్ సంజితాశెట్టి మరో హీరోయిన్గా నటించనున్నారు. ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. రాము సిల్లప్ప దర్శకత్వం వహిస్తున్నారు. -
'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు'
తల నెరిసినా, తెల్లజుట్టుతోనే హీరో పాత్రలు చేస్తున్న అజిత్.. తన తాజా చిత్రం ఎన్నై అరిందాల్‌లో నటించిన పార్వతీ నాయర్‌కు మంచి గిఫ్ట్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఎన్నై అరిందాల్ సినిమాలో తన పనితీరు నచ్చడంతో.. స్వతహాగా మంచి ఫొటోగ్రాఫర్ అయిన అజిత్, తన నిలువెత్తు ఫొటో తీసి బహుమతిగా ఇచ్చారని చెప్పింది. షూటింగ్ విరామంలో ఎప్పుడూ అజిత్ చేతిలో కెమెరా ఉంటుంది. తనను చాలా మంచి పోజులో ఆయన ఫొటో తీశారని, అలా తీస్తున్న విషయం కూడా అప్పుడు తనకు తెలియదని పార్వతి తెలిపింది. ఆ ఫొటోను బ్లాక్ అండ్ వైట్‌లో ప్రింట్ చేయించి, ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇచ్చారట. తన ఇంటి గోడకు ఆ ఫొటోను తగిలించేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎన్నై అరిందాల్ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, అనుష్క, త్రిష ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఉత్తమవిలన్ సినిమాలో కూడా పార్వతీ నాయర్ నటించింది. అందులో ఆమెది కీలకపాత్ర అంటున్నారు. -
తీయని అనుభూతి మరచిపోలేని బహుమతి
నటుడు అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తే నటీమణుల జాబితాలో మరో నటి చేరింది. త్రిష లాంటి నటీమణులు తమకు సరైన జోడి అజిత్‌నేనని చాలాసార్లుబహిరంగంగానే ప్రకటించారు. తాజాగా నటి పార్వతి నాయర్ అజిత్ తనకు మరువలేని తీయని అనుభూతి కలిగించే బహుమతిని ఇచ్చారంటూ తెగ ప్రచారం చేసుకుంటోంది. విషయానికొస్తే అజిత్, త్రిష, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఎన్నై అరిందాల్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన ఈ భారీ చిత్రం ఈ నెల 5న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పార్వతి నాయర్ నటిస్తున్నారు. ఆమె తన మనోభావాలను తెలుపుతూ తాను నూతన నటి కావడంతో చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలు వస్తాయని, వాటిద్వారా తన ప్రతిభను నిరూపించుకుని సినిమా వర్గాల దృష్టిని ఆకర్షించుకోవాలని భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా కమలహాసన్, అజిత్‌లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొంది. ఆ ఆశ్చర్యానందం నుంచి తానింకా బయటపడలేదంది. ఎన్నై అరిందాల్ చిత్రం షూటింగ్లో ఒక కుటుం బంగా కలిసి పని చేసిన అనుభవం మరువలేనని చెప్పింది. అందులో అజిత్‌తో కలిసి నటించడం తీయని అనుభూతిగా పేర్కొంది. షూటింగ్ స్పాట్లో ఆయన ఎవరినో ఒకరిని తన కెమెరాతో ఫొటోలు తీస్తునే ఉంటారని చెప్పింది. అలా తనకు తెలియకుండా తన ఫొటో తీసి ఫ్రేమ్ కట్టి తనకు కానుకగా ఇచ్చి అబ్బుర పరిచారని తెలిపింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫొటో తనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని అంది. ఆ ఫొటోను తన ఇంట్లో పెట్టుకున్నానని చెప్పింది. ఉత్తమ విలన్ చిత్రంలో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొంది. కమలహాసన్ వంటి గొప్ప నటుడితో నటించడానికి మొదట చాలా భయపడ్డానని అంది. అలాంటిది ధైర్యంగా నటించే పరిస్థితిని ఆయనే కల్పించారని తెలిపింది. -
సో స్వీట్...
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే స్టార్ కథానాయికల్లో అనుష్క ముందు వరుసలో ఉంటారు. ఆమె కెరీర్లోఎవరితోనూ గొడవపడ్డ దాఖలాలు కనపడవు. ‘లింగ’లో సోనాక్షీ సిన్హా పాత్ర కాస్త డామినేటింగ్‌గా ఉన్నా, ‘ఎంతవాడు గాని’ చిత్రంలో త్రిష పాత్ర కథలో కీలమైనదైనా... అనుష్క మాత్రం ఆ విషయాలను తేలిగ్గా తీసుకున్నారట. పైగా తోటి హీరోయిన్లతో ఆమె నడుచుకునే తీరు, అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తోందని టాక్. టాప్ హీరోయిన్ అయ్యుండి కూడా ‘ఎంతవాడు గాని’ సెట్లో మలయాళ నటి పార్వతీ నాయర్‌ని ఎంతో గౌరవిస్తున్నారట అనుష్క. సెట్లో ఆమె పుట్టిన రోజును స్వయంగా అనుష్కే ఘనంగా నిర్వహించారట. ‘‘అనుష్కను నేను ఇంతకు ముందు కలవలేదు. కలిశాక...ఆమెలోని సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాను. ఆమె సో స్వీట్. స్టార్ హీరోయిన్ననే ఫీలింగే ఆమెలో కనిపించదు. సెట్లో ఆమె నా పుట్టిన రోజుని జరిపిన తీరును నేనెప్పటికీ మరిచిపోను. పర్ఫెక్ట్ సౌతిండియన్ లుక్‌తో ఉంటారు కాబట్టే దక్షిణాదిన సూపర్‌స్టార్ కాగలిగారామె’’ అంటూ అనుష్కను పొగడ్తల్లో ముంచేశారు పార్వతి. ఇదిలావుంటే... అజిత్ కథానాయకునిగా గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో అనుష్క, త్రిష కలిసి నటిస్తున్న ‘ఎంతవాడు గాని’ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. హేరిస్ జైరాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలలోనే విడుదల చేసి, జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు ఈ చిత్ర సమర్పకుడు సి.కల్యాణ్.