సో స్వీట్... | Parvathy Nair admires Anushka | Sakshi
Sakshi News home page

సో స్వీట్...

Published Fri, Dec 12 2014 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

సో స్వీట్...

సో స్వీట్...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే స్టార్ కథానాయికల్లో అనుష్క ముందు వరుసలో ఉంటారు. ఆమె కెరీర్‌లోఎవరితోనూ గొడవపడ్డ దాఖలాలు కనపడవు. ‘లింగ’లో సోనాక్షీ సిన్హా పాత్ర కాస్త డామినేటింగ్‌గా ఉన్నా, ‘ఎంతవాడు గాని’ చిత్రంలో త్రిష పాత్ర కథలో కీలమైనదైనా... అనుష్క మాత్రం ఆ విషయాలను తేలిగ్గా తీసుకున్నారట. పైగా తోటి హీరోయిన్లతో ఆమె నడుచుకునే  తీరు, అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తోందని టాక్. టాప్ హీరోయిన్ అయ్యుండి కూడా ‘ఎంతవాడు గాని’ సెట్‌లో మలయాళ నటి పార్వతీ నాయర్‌ని ఎంతో గౌరవిస్తున్నారట అనుష్క. సెట్‌లో ఆమె పుట్టిన రోజును స్వయంగా అనుష్కే ఘనంగా నిర్వహించారట.

‘‘అనుష్కను నేను ఇంతకు ముందు కలవలేదు. కలిశాక...ఆమెలోని సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాను. ఆమె సో స్వీట్. స్టార్ హీరోయిన్‌ననే ఫీలింగే ఆమెలో కనిపించదు. సెట్‌లో ఆమె నా పుట్టిన రోజుని జరిపిన తీరును నేనెప్పటికీ మరిచిపోను. పర్‌ఫెక్ట్ సౌతిండియన్ లుక్‌తో ఉంటారు కాబట్టే దక్షిణాదిన సూపర్‌స్టార్ కాగలిగారామె’’ అంటూ అనుష్కను పొగడ్తల్లో ముంచేశారు పార్వతి.

ఇదిలావుంటే... అజిత్ కథానాయకునిగా గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో అనుష్క, త్రిష కలిసి నటిస్తున్న ‘ఎంతవాడు గాని’ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. హేరిస్ జైరాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలలోనే విడుదల చేసి, జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు ఈ చిత్ర సమర్పకుడు సి.కల్యాణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement