అజిత్‌ ఇన్‌ బ్లాక్‌ | Ajith's new look for Viswasam has him ditching the salt-and-pepper hair | Sakshi
Sakshi News home page

అజిత్‌ ఇన్‌ బ్లాక్‌

Published Fri, Dec 22 2017 12:31 AM | Last Updated on Fri, Dec 22 2017 12:31 AM

Ajith's new look for Viswasam has him ditching the salt-and-pepper hair - Sakshi

సౌత్‌ ఇండియన్‌ హీరోస్‌లో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ (అక్కడక్కడా నెరిసిన జుత్తు, గెడ్డం) లుక్‌తో ఎక్కువగా కనిపించే హీరో అజిత్‌. కానీ, ఈసారి లుక్‌ మార్చబోతున్నారట. మూడు నాలుగేళ్లుగా అజిత్‌ ఈ గెటప్‌లోనే కనిపిస్తున్నారు. ఫర్‌ ఎ చేంజ్‌ తన తదుపరి సినిమా కోసం సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఫుల్‌ బ్లాక్‌లో కనిపించబోతున్నారట. ఫుల్‌ బ్లాక్‌ అంటే ఒంటి రంగు అనుకునేరు.

జుట్టు, గడ్డం రంగు. ఇంతకీ ఏ సినిమాలో ఈ గెటప్‌ అంటే.. ‘విశ్వాసం’లో. అజిత్‌ హీరోగా  ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి హిట్స్‌ ఇచ్చిన శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ  చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై జి.త్యాగరాజన్, జి. శరవణన్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో అనుష్క పేరుని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. జనవరి 19న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2018 దీపావళికి రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement