అజిత్‌తో రొమాన్సా? | Aathmika denies being a part of Ajith's Viswasam | Sakshi
Sakshi News home page

అజిత్‌తో రొమాన్సా?

Published Sat, Feb 3 2018 4:35 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Aathmika denies being a part of Ajith's Viswasam - Sakshi

ఆద్మియ, అజిత్‌

తమిళసినిమా: నటుడు అజిత్‌తో రొమాన్సా? నేనా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది వర్థ్ధమాన నటి ఆద్మియ. ఈ బ్యూటీకి అజిత్‌ తాజా చిత్రం విశ్వాసంలో నటించే అవకాశం వచ్చిందని సోషల్‌మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. వివేకం తరువాత అజిత్, దర్శకుడు శివ నాలుగోసారి కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే. వివేకం నిర్మాత టీజీ.త్యాగరాజన్‌నే తన సత్యజ్యోతి ఫిలిం పతాకంపై విశ్వాసం చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రీ పొడక్షన్స్‌ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 22న సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

మరోసారి దాదాగా.. అజిత్‌ మరోసారి విశ్వాసం చిత్రంలో దాదాగా కనిపించనున్నారని సమాచారం.ఈసారి ఆయన ఉత్తర చెన్నై దాదాగా దుమ్మురేపనున్నారట. ఇందులో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను చిత్ర యూనిట్‌ ఇంకా వెల్లడించలేదు.సోషల్‌మీడియాల్లో మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క నటించే అవకాశం ఉందని,  విలన్‌గా విజయ్‌ ఏసుదాస్‌ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అజిత్‌ చిత్రంలో తాను నటించడం లేదని ఏసుదాస్‌ స్పష్టం చేశారు.

తాజాగా ఆద్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ అభిమాన హీరో సరసన ఆద్మిక లాంటి వర్థమాన నటిని వారు ఊహించుకోలేకపోతున్నారు. ఇలాఉండగా ఆద్మిక కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అజిత్‌తోనే? నేనా? ఎవరు చెప్పారు? నాకే తెలియదే? అంటూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ పెట్టి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో విశ్వాసం చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. అయితే త్వరలోనే విశ్వాసం చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement