హిట్ కాంబో రిపీట్.. స్టార్ హీరోతో ఆ దర్శకుడు ఐదో సినిమా | Thala Ajith And Director Siva Combo On Cards Once Again | Sakshi
Sakshi News home page

హిట్ కాంబో రిపీట్.. స్టార్ హీరోతో ఆ దర్శకుడు ఐదో సినిమా

Published Sun, Feb 4 2024 12:50 PM | Last Updated on Sun, Feb 4 2024 12:50 PM

Thala Ajith And Director Siva Combo On Cards Once Again - Sakshi

దళపతి విజయ్‌, తలా అజిత్‌ అభిమానుల వైరం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే తమ హీరో గొప్ప, తమ హీరో గొప్ప అని ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అయితే తాజాగా విజయ్, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే టైంలో అజిత్ వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలా ఇప్పుడు తనకు నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు న్యూస్ బయటకొచ్చింది. 

(ఇదీ చదవండి: మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తున్న ధనుష్)

అజిత్ ప్రస్తుతం తన 62వ సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'విడామయూర్చి' అనే టైటిల్ నిర్ణయించారు. మగిళ్‌ తిరుమేణి దర్శకుడు. షూటింగ్‌ చివరి దశకు చేరుకోగా.. మేలో విడుదల చేయాలని చూస్తున్నారు. కాగా అజిత్‌ తన 63వ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. దీని తర్వాత వెట్రిమారన్‌‌తో మూవీ ఉంటుందని అంటున్నారు. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. 

ఈ క్రమంలోనే దర్శకుడు శివ పేరు తెరపైకి వచ్చింది. అజిత్‌ తన 64వ సినిమాని శివకి అప్పగించాలని అనుకుంటున్నారట. గతంలో వీళ్ల కాంబోలో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం లాంటి నాలుగు సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయేది ఐదో చిత్రం కాబోతుంది. అయితే ఈ మూవీస్ అన్నీ కూడా తమిళంలో హిట్ అయ్యాయి కానీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

(ఇదీ చదవండి: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్‌.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement