టబు గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జనరేషన్‌ని అడిగితే ఆమె యాక్టింగ్ గురించి చెబుతారు. గత కొన్నేళ్ల నుంచి పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయిన ఈ బ్యూటీ.. మధ్యలో 'అల వైకుంఠపురములో' అనే తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. తర్వాత మళ్లీ హిందీపైనే ఫోకస్ చేసింది. అలాంటిది ఇప్పుడు మరోసారి దక్షిణాదిలో నటించనుంది.
(ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?)
తమిళంలో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'విడాముయర్చి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ కాగా నటిస్తుండగా అర్జున్, రెజీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ టబు నటిస్తున్నట్లు తాజా సమాచారం.
2000లో టబు-అజిత్ జంటగా తమిళంలో 'కండు కొండేన్' అనే సినిమా వచ్చింది. 'ప్రియురాలు పిలిచింది' పేరుతో ఇది తెలుగులోనూ డబ్ అయింది. రాజీవ్ మేనన్ దర్శకుడు. అదే ఏడాది మరో తమిళ సినిమా చేసిన టబు.. 2013లో మరో తమిళ మూవీ చేసింది అంతే. మళ్లీ ఇన్నాళ్లకు మరో చిత్రానికి గ్రీన్ సిగ‍్నల్ ఇచ్చింది. ఇకపోతే అజిత్‍తో అయితే ఏకంగా 24 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతుందనమాట.
(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment