'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు' | Ajith gift is appreciation for my work, says Parvathy Nair | Sakshi
Sakshi News home page

'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు'

Published Mon, Feb 2 2015 11:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు'

'నా పనితీరు నచ్చే అజిత్ గిఫ్ట్ ఇచ్చారు'

తల నెరిసినా, తెల్లజుట్టుతోనే హీరో పాత్రలు చేస్తున్న అజిత్.. తన తాజా చిత్రం ఎన్నై అరిందాల్లో నటించిన పార్వతీ నాయర్కు మంచి గిఫ్ట్ ఇచ్చారట.  ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఎన్నై అరిందాల్ సినిమాలో తన పనితీరు నచ్చడంతో.. స్వతహాగా మంచి ఫొటోగ్రాఫర్ అయిన అజిత్, తన నిలువెత్తు ఫొటో తీసి బహుమతిగా ఇచ్చారని చెప్పింది. షూటింగ్ విరామంలో ఎప్పుడూ అజిత్ చేతిలో కెమెరా ఉంటుంది.

తనను చాలా మంచి పోజులో ఆయన ఫొటో తీశారని, అలా తీస్తున్న విషయం కూడా అప్పుడు తనకు తెలియదని పార్వతి తెలిపింది. ఆ ఫొటోను బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేయించి, ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇచ్చారట. తన ఇంటి గోడకు ఆ ఫొటోను తగిలించేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎన్నై అరిందాల్ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, అనుష్క, త్రిష ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఉత్తమవిలన్ సినిమాలో కూడా పార్వతీ నాయర్ నటించింది. అందులో ఆమెది కీలకపాత్ర అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement