హీరోయిన్‌గా పార్వతీ నాయర్
ఎన్నై అరిందాల్, ఉత్తమ విలన్ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన నటి పార్వతీనాయర్‌కు కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ప్రమోషన్ వచ్చింది. ఎన్‌కిట్ట మోదాదే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. చతురంగవేట్టై, కదం కదం చిత్రాల నటుడు నటరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎన్‌కిట్ట మోదాదే. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి పార్వతీ నాయర్ తెలుపుతూ ఈ చిత్రంలో తన పాత్ర గురించి తెలియగానే చాలా ఆనందం కలిగిందని అంది. తన పాత్ర గురించి దర్శకుడు ఇప్పుడే బయట ఎక్కడా చెప్పొద్దని నిబంధన విధించారు కాబట్టి తానేమి చెప్పలేనని పేర్కొంది. అయితే ఇలాంటి పాత్ర ఇంతకుముందే తమిళ తెరపై రాలేదని మాత్రం చెప్పగలనని అంది. ఈ చిత్రంలో పార్వతీనాయర్‌తో పాటు సూదుకవ్వుం చిత్రం ఫేమ్ సంజితాశెట్టి మరో హీరోయిన్‌గా నటించనున్నారు. ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. రాము సిల్లప్ప దర్శకత్వం వహిస్తున్నారు.