మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన నిత్య మేనన్‌కు(Nithya Menen) భారీగానే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎంచుకున్న పాత్రలు కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. సినిమా రంగం వల్ల తనకు పేరు, ప్రఖ్యాతలు ,ఆస్తులు, అంతస్తులు అన్ని వచ్చాయి. అయినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. అందుకే ఈమెను సంచలన నటి అంటారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ తాజాగా రవి మోహన్‌తో (జయం రవి) కలిసి నటించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై (Kadhalikka Neramillai).
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిత్య మేనన్ ఒక భేటీలో పేర్కొంటూ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌గానే చెప్పింది. తనకు ఏదైనా రంగంలో ఇప్పుడు అవకాశం వస్తే వెళ్లిపోతానని పేర్కొంది. సెలబ్రిటీలా కాకుండా తనకు సాధారణ జీవితాన్ని అనుభవించడమే ఇష్టమని పేర్కొంది. అదేవిధంగా తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే పైలెట్ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది. కానీ, ఫైనల్‌గా నటిని అయ్యానని చెప్పింది. నటిగా స్వేచ్ఛగా జీవించడం మరిచిపోయానని తెలిపింది.
అదేవిధంగా పార్కుల్లో నడవటం అంటే ఎంతో ఇష్టమని అయితే అది ఇప్పుడు జరగదని పేర్కొంది. ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా అని అనిపిస్తుందని చెప్పింది. జాతీయ అవార్డు రాకముందు సైలెంట్ గా ఎక్కడికై నా వెళ్లిపోతామని భావించానంది అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే వార్త తెలిసిందని నటి నిత్యా మీనన్ చెప్పింది. కాగా ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై చిత్రంలో కథానాయికిగా నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment