కోలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ ఇంద్రజకు (Indraja) కుమారుడు జన్మించాడు. గతేడాదిలో తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేసింది. ఇంద్రజ తండ్రి రోబో శంకర్(Robo Shankar) తమిళ్ చిత్ర సీమలో కమెడియన్‌గా రాణించారు. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.
నటి ఇంద్రజ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన)
తమిళ్‌లో ప్రసారం అవుతున్న`మిస్టర్ అండ్ మిస్సిస్` షో చేస్తున్నప్పుడు ఇంద్రజ గర్భవతి అయింది. ఈ విషయం ఆమె చెబుతూ ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలుపుతున్నారు. మనవడు పుట్టడంతో రోబో శంకర్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
కార్తీక్‌ను దత్తత తీసుకున్న రోబో శంకర్,ప్రియాంక దంపతులు
ఇంద్రజ పెళ్లి తర్వాత అందరూ తన మేనమామనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అని చాలామంది అనుకున్నారు. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని అనుకున్నారు. ఈ క్రమంలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఇంద్రజకు మేనమామను కాదని గతంలో ఓ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. తాను ఇంద్రజ అమ్మ ప్రియాంకకు సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక ఇద్దరూ చాలారోజులుగా తెలుసు. ప్రియాంకకు సోదరులు లేకపోవడంతో ఆమె తనను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment