అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్ | Actress Samantha At Her Brother David's Wedding In US | Sakshi
Sakshi News home page

Samantha: తమ్ముడి పెళ్లి కోసం అమెరికా వెళ్లిన సామ్

Published Sun, Sep 22 2024 8:48 AM | Last Updated on Sun, Sep 22 2024 9:55 AM

Actress Samantha At Her Brother David's Wedding In US

హీరోయిన్ సమంత అమెరికాలో జరిగిన పెళ్లిలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన చాలా ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అసలు ఈ వివాహ వేడుక ఎవరిదా అని ఆరాతీస్తే సమంత తమ్ముడు డేవిడ్‌దని తెలిసింది. ఇన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు గొడవలన్నీ క్లియర్ చేసుకుని వాళ్లతో కలిసిపోయినట్లు అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: భార్యకి సరైన గౌరవం ఇవ్వాలి.. ఖుష్బూ షాకింగ్ ట్వీట్)

తమిళనాడులో పుట్టి పెరిగిన సమంతకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీళ్లలో చిన్నోడే డేవిడ్. ఇతడి పెళ్లి అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగింది. నికోల్ అనే అమ్మాయినతో క్రిస్టియన్ సంప్రదాయంలో ఒక్కటయ్యాడు. ఈ వేడుకలో సమంత తోడు పెళ్లి కూతురిలా (బ్రైడ్స్ మేడ్) కనిపించింది. స్లీవ్‌లెస్ గౌనులో అందంగా మెరిసిపోయింది. ఇక తమ్ముడి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సామ్.. వైట్ హర్ట్, స్పార్కిల్ ఎమోజీతో పాటు 'ఫ్యామిలీ' అని రాసుకొచ్చింది.

'ఏ మాయ చేశావె' మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించింది. చివరగా 'ఖుషి' సినిమా చేసింది. ప్రస్తుతం 'సిటాడెల్ హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ చేసింది. నవంబరు 7న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత ఫ్యామిలీకి ఈమెకు మధ్య దూరం పెరిగిందని, అందుకే ముంబైలో ఒంటరిగా ఉందని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తమ్ముడి పెళ్లి వల్ల సమంత మళ్లీ కుటుంబానికి దగ్గరైపోయినట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement