ice bucket challenge
-
'చిరుత' హీరోయిన్ ఐస్ బాత్.. కారణం అదేనా?
చిరుత హీరోయిన్ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే ఈమె తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో చేసింది. బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏం లాభం. టాలీవుడ్లో మరో మూవీ తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు ఏకంగా ఐస్ బాత్ వీడియో హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా) ఇప్పుడేం చేస్తోంది? 'చిరుత' తర్వతా వరుణ్ సందేశ్ 'కుర్రాడు' మూవీలో హీరోయిన్ గా చేసిన నేహాశర్మ.. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయినాసరే పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలా నటిగా పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ.. అక్క ఐషా శర్మతో కలిసి అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఐస్ బాత్ ఛాలెంజ్ జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం లాంటివి కాకుండా ఇప్పుడు ఐస్ బాత్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లు రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఐస్ బాత్ ఛాలెంజ్ స్వీకరించింది. వాళ్లలానే తనకూడా ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ బికినీలో ఈమె హాట్‌నెస్‌కి టబ్‌లోని మంచు కరిగిపోవడం గ్యారంటీ అని నెటిజన్స్ రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’
-
ఇంటర్నెట్లో మరో ఛాలెంజ్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ లాగా ఇప్పుడు ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’ సంచలనం సష్టిస్తోంది. ఇందులో చేయాల్సిందల్లా సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదా మిత్ర బందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ ఛాలెంజ్‌ను సృష్టించిందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది అమెరికా పోస్ట్’ పత్రిక వెల్లడించింది. గుడ్‌మార్నింగ్ బ్రిటన్స్ రిపోర్టర్ అరెక్స్ బెరెస్ఫోర్డ్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తన రియాక్షన్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించడం మరి ఇంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి. -
ఐస్ బకెట్ ఛాలెంజ్ గుర్తుందా...?
రెండేళ్ల క్రితం అటు వార్తా పత్రికల్లో ఇటు సోషల్‌మీడియాలో హల్చల్ చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ గుర్తుందా? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరకూ బకెట్ల కొద్దీ మంచునీళ్లను తలపై గుమ్మరించుకుని ఓ అరుదైన వ్యాధి చికిత్సకు తమ వంతు సాయమందించిన సందర్భం అది. కేవలం 30 రోజుల్లో పది కోట్ల డాలర్లు సేకరించిన తర్వాత ఈ పోటీపై మాట్లాడుకున్నవారే లేకుండాపోయారు. అయితే ఈ పోటీ నిర్వాహకుల ప్రయత్నాల పుణ్యమా అని ఈ రెండేళ్లలో ఏఎల్ఎస్ వ్యాధి చికిత్సలో మెరుగైన పురోగతి వచ్చింది. ఐస్‌బకెట్ ఛాలెంజ్ ద్వారా సేకరించిన మొత్తంతో ఏఎల్ఎస్ అసోసియేషన్ ‘ప్రాజెక్ట్ మిన్ఈ’ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏఎల్ఎస్ వ్యాధి బాధితులైన దాదాపు 15 వేల మంది జన్యుక్రమాలను విశ్లేషించారు. దీనిద్వారా వంశపారంపర్యంగా లేదా కొన్ని తెలియని కారణాలతో వచ్చే ఈ నాడీ సంబంధిత వ్యాధికి ఒక జన్యువు కారణమని తెలిసింది. ఎన్ఈకే1 అని పిలుస్తున్న ఈ జన్యువును గుర్తించడం వల్ల ఏఎల్ఎస్కు త్వరలోనే చికిత్స కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అక్షయ్ ఓటమి... జాక్వెలిన్ గెలుపు!
అది హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్-3’ షూటింగ్ స్పాట్. షాట్ ఓకే కాగానే హీరో అక్షయ్‌కుమార్ అక్కడ ఖాళీగా ఉన్న స్థలంలో రెండు ఫుట్‌బాల్స్ ఉంచారు. కిందకి వొంగి, ఒక ఫుట్ బాల్‌ను ఓ చేత్తో అదిమి పట్టుకుని, దాని చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. 1...2...3... ఇలా 13 సార్లు తిరిగి, దానికి దగ్గరగా ఉన్న మరో ఫుట్‌బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి కొట్టారు. కానీ బ్యాడ్‌లక్. గోల్ చేయలేకపోయారు. ఇదేం ఆట? అక్షయ్‌కుమార్ ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా? ‘డిజీ గోల్స్’ అనే చాలెంజ్‌లో భాగంగా ఆయన ఇలా చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సవాల్ హవా జోరుగా సాగుతోంది. ‘ఐస్ బకెట్ చాలెంజ్’ తరహాలో సాగే పోటీయే ‘డిజీ గోల్స్’ చాలెంజ్. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి అందులో సక్సెస్ అయ్యారు. మన దేశం నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మొట్టమొదటి సెలబ్రిటీగా అక్షయ్‌కుమార్ ఖ్యాతికెక్కారు. ఈ సవాల్లో అక్షయ్ ఓడారు కానీ, ఆయన సరసన నటిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం గెలిచారు. పేదరికం, అసమానత్వం, వాతావరణ మార్పుల మీద అవగాహన కల్పించడానికి ఈ డిజీ గోల్స్ చాలెంజ్‌ను ప్రవేశపెట్టారు. మరి.. ఈ సినిమా తారల్లో ఈ చాలెంజ్‌ను ఎవరెవరు స్వీకరిస్తారు? ఎవరు గెలుస్తారు? అనేది చూడాలి. -
లెన్స్ - ఎసెన్స్
చల్లటి ఛాలెంజ్ ఈ మధ్యనే ప్రపంచమంతా ‘ఐస్‌బకెట్ ఛాలెంజ్’ తో వణికి ఆనందించింది. చైనాలో ఇలాంటి సంప్రదాయమే ఒకటుంది. దీన్ని ‘ఐస్‌వాటర్ ఛాలెంజ్’ అంటారు. ఐస్‌తో ఉండే కొలను లోకి దిగి, చేతులతో పెద్ద మంచుపలకను పట్టుకొని, ఐస్ క్రీమ్ తినాలి. దీనికి తోడు పక్కనుంచి చల్లటి గాలి విసిరే ఫ్యాన్ఎఫెక్ట్ అదనం. ఇలాంటి చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు హనాన్ ప్రావీన్స్‌లోని జాంగ్జియాజీ పట్టణవాసులు. సరదాగా సాగే ఈ పోటీలో ఎక్కువసేపు ఆ కొలనులో ఉన్నవారే విజేతలు. దానమహోత్సవం దానం ఇవ్వడం ఎక్కడైనా గొప్ప పనే. ఈ పనికి ప్రత్యేకంగా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, సందర్భాలు కూడా ప్రతి సంస్కృతిలోనూ ఉంటాయి. తన ఆస్తులన్నింటినీ దానంగా ఇచ్చి సన్యాసిగా మారిన 19వ శతాబ్దపు స్పెయిన్ ధనవంతుడు సాన్ ఆంటోనియో అబాద్ స్ఫూర్తితో స్పెయిన్‌లో ప్రతి ఏడాదీ జనవరి 25న దానోత్సవం మొదలవుతుంది. 36 గంటలపాటు స్పెయిన్ ప్రజలు తమకు చేతనైనంత దానం చేస్తూ ఆంటోనియో స్ఫూర్తిని చాటుతారు. ఈ సందర్భంగా ఇటీవల స్పెయిన్ దక్షిణ ప్రాంతంలోని ట్రిగ్యురోస్ అనే గ్రామంలో సంబరాల్లో భాగంగా ఒక మహిళ ఇంటి కిటికీలోంచి బ్రెడ్రోల్స్ను విసురుతోంది. సైకిలెక్కిన సాహసం టూ వీలర్ నడపడం ఈజిప్షియన్ మహిళ ధైర్యసాహసాలకు నిదర్శనం. మహిళలు సైకిల్ తొక్కడం, మోటర్ సైకిల్ నడపడంపై చాలా అరబ్ దేశాల్లో నిషేధం ఉంది. అయితే ఈజిప్టులో అధికారికంగా నిషేధం ఏమీ లేకపోయినా సంప్రదాయవాదుల తీరుతో ఈ దేశంలో వీటిపై అప్రకటిత నిషేధం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా రాజధాని కైరో వీధుల్లో కొంతమంది యువతులు సైకి ల్లో దూసుకుపోతూ కనిపిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి వీరిది పెద్ద సాహసమే. -
ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ చాలెంజ్!
ప్రచారంపై తొమ్మిది మంది ప్రముఖులకు మోదీ ఆహ్వానం న్యూఢిల్లీ: ప్రజలతో భావాలను పంచుకునేందుకు ఇంటర్నెట్ను విరివిగా వాడే ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్’పై ప్రచారం కోసం వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఇంటర్నెట్లో ఇటీవల హల్చల్ చేసిన ‘ఐస్ బకెట్ చాలెంజ్’ నుంచి స్ఫూర్తి పొందారో ఏమోగానీ మోదీ ఆ తరహాలో తనదైన సవాల్‌ను విసిరారు. పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. తద్వారా ఈ గొలుసుకట్టు ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మోదీ చెప్పారు. మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ టీవీ సీరియల్ బృందం ఉంది. ఉద్యమానికి అంకితం: అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ ప్రచార ఉద్యమానికి తాను అంకితం అవుతానని రిలయెన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. దీనిపై ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు. ప్రచారకర్తగా నియమిస్తే సంతోషం: ఆమిర్‌ఖాన్ ప్రధాని మోదీతో కలిసి ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యమంలో ప్రభుత్వం తనను ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమిస్తే సంతోషిస్తానన్నారు. ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా చేపడతానన్నారు. -
ఇదో సరికొత్త ఛాలెంజ్!
ఐస్ బకెట్ ఛాలెంజ్ అయిపోయింది... ఆ తర్వాత రైస్ బకెట్ ఛాలెంజీ ఇప్పుడు పాతబడిపోయింది. అమెరికా అధ్యక్షుడి స్థాయి నుంచి అతి సామాన్యులు, సెలబ్రిటీల దాకా ఈ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ, మరికొంతమందికి ఆ సవాలును విసురుతూ వార్తల్లోకి వచ్చారు. ఏదోవ్యాధి బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. పేదల కడుపు నింపడానికి రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా అంతే ఆదరణ పొందింది. ఈ రెండూ సదుద్దేశంతో కూడిన కార్యక్ర మాలు కాబట్టి మీడియా కూడా బాగానే ప్రచారమిచ్చింది. అలాంటి ఐస్ బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే మరో కార్యక్రమం మొదలవుతోంది. మహిళల ఆరోగ్యం గురించిన ఉద్యమమిది. ‘హైజీన్ బకెట్ ఛాలెంజ్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రచారంలోకి వస్తోంది. వడోదరా కేంద్రంగా పనిచేసే ‘వాత్సల్య ఫౌండేషన్’ వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక బకెట్ నిండా శానిటరీ న్యాపికిన్లను విరాళంగా సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మురికివాడల్లో నివసించే మహిళలకు ఆ శానిటరీ న్యాపికిన్లను అందించడానికి ఆ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పేదరికంలో మగ్గుతున్న మహిళల్లో శానిటరీ న్యాప్కిన్లపై అవగాహన నింపడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది వాత్సల్య ఫౌండేషన్. ఇందులో భాగంగా వీరు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ‘‘గ్రామీణ మహిళల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో కూడా శానిటరీ న్యాప్కిన్ల గురించి అవగాహన లేదు. ఫలితంగా వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి సాయంగా నిలవడానికే ఈ ప్రయత్నం. ఈ నేపథ్యంలో కొంత సామాజిక ప్రచారం... దాతల సహకారం కోసం ఐస్‌బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం..’’ అని ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు. ముందుగా ఈ ఛాలెంజ్‌ను వడోదరాకే చెందిన కల్పనా షా అనే మహిళ స్వీకరించింది. ఆమె ఒక బకెట్ న్యాప్కిన్లను తన పనిమనిషికి డొనేట్ చేసింది. తను డొనేట్ చేయడమే గాక తన స్నేహితురాళ్లలో కొందరిని ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా కల్పనా షా ఛాలెంజ్ చేసింది. దీనికి స్పందనగా కొంతమంది మహిళలు ఈ విరాళానికి ముందుకొచ్చారు. విద్యావేత్త అయిన నందితా అమిన్ తమకు సమీపంలోని గ్రామంలోని అమ్మాయిల బాధ్యత తీసుకొన్నారు. కొంతమంది అమ్మాయిలకు ఈ విషయంలో అండగా నిలబడేందుకు ఆమె ముందుకొచ్చారు. ఆర్థిక స్థితి బాగుండక అనేక మంది మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు వాడే అవకాశం లేకుండా పోతోందని.. పేదరికం పర్యవసనంగా మహిళల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడాన్ని నిరోధించడంలో భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉందని అమిన్ చెప్పారు. ఇలా ఆ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం క్రమంగా ఊపందుకొంటోంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు అనేకమంది గ్రామీణ, పేద మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని సాటి మహిళలుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది మహిళలకు శానిటరీ న్యాప్కిన్ల సాయం అందిందని వాత్సల్య ఫౌండేషన్ నిర్వాహకులు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కూడా మహిళల ఆరోగ్యప్రయోజనాలను గుర్తించి శానిటరీ న్యాప్కిన్ల విషయంలో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి సామాజిక సేవా సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించడం ద్వారా కొంతమంది మహిళలకు బాసటగా నిలిచినా అది అభినందించదగ్గ ప్రయత్నమే అవుతుంది. -
జర్మనీ రాయబారి ‘రైస్ బకెట్ సవాల్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘ఐస్‌బకెట్ సవాల్’ ట్రెండ్ కొనసాగుతుండగా.. మన దే శంలో ‘రైస్‌బకెట్ సవాల్ ఊపందుకుంటోంది. ఢిల్లీ చాణక్యపురిలో మంగళవారం రైస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్.. స్థానిక మురికివాడలో 392 పేద కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం బకెట్లను అందజేశారు. పేదరిక నిర్మూలనకు తోడ్పాటుగా చింతన్ అనే ఎన్జీవోతో కలిసి జర్మన్ ఎంబసీ ఈ కార్యక్రమం నిర్వహించింది. మురికివాడను అభివృద్ధి చేసే కార్యక్రమం కోసం రూ.27 కోట్లను కేటాయించనున్నట్లూ స్టీనర్ తెలిపారు. కాగా, నాడీ సంబంధమైన ఏఎల్ఎస్, మోటార్ న్యూరాన్ వ్యాధిపై పరిశోధిస్తున్న ఏఎల్ఎస్ ఫౌండేషన్‌కు నిధుల కోసం అంతర్జాతీయంగా ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం అయింది. కానీ.. మన దేశంలో ఆకలే పెద్ద సమస్య. కాబట్టి.. దేశీయ వెర్షన్ అయిన రైస్ బకెట్ చాలెంజ్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సైట్ల ద్వారా నెటిజన్లు పెద్ద ఎత్తున సవాళ్లు స్వీకరించి, విసురుకుంటున్నారు. పెద్ద ఎత్తున నెటిజన్లను కదిలిస్తున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్‌ను హైదరాబాద్‌కు చెందిన మహిళ మంజులత మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. -
‘రైస్ బకెట్ చాలెంజ్’
న్యూఢిల్లీ: నెట్ ప్రపంచంలో నిన్న ఐస్ బకెట్ చాలెంజ్ సందడి చేస్తే... ఓ హైదరాబాదీ మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ నేడు ఆ స్థాయిలో నెటిజన్లను సేవ దిశగా కదిలిస్తోంది. ఓ వ్యాధిపై ప్రచారం కోసం బకెట్ నీటిని ఒకరి తలపై కుమ్మరించేలా... ఇటీవల అమెరికాలో ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం కాగా, దానికి ఓ హైదరాబాదీ దేశీయ రూపునిచ్చారు. అన్నార్థులకు ఓ బకెట్ బియ్యం దానం చేయండంటూ ‘రైస్ బకెట్ చాలెంజ్’ అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయురాలు మంజులతా కళానిధి. ‘‘ఓ బకెట్ బియ్యాన్ని వండి లేదా బిర్యానీని చేసి మీ ప్రాంతంలో పేదల ఆకలి తీర్చండి. ఈ సవాల్‌ను స్వీకరించలేకపోతే కనీసం ఓ వంద రూపాయల విలువైన మందులను ప్రభుత్వానికి దానంగా ఇవ్వండి’’ అంటూ మంజులత ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ సవాల్‌ను చూసిన చాలా మంది నెటిజన్లు వెంటనే స్పందించారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడమే కాకుండా దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. బకెట్ బియ్యాన్ని దానం చేయడం ద్వారా పేదవారి ఆకలి తీర్చడానికి నెటిజన్లు ఉత్సాహంగా ముందుకొస్తుండడం విశేషం. -
ఒకరు బికినీలో.. ఒకరు నగ్నంగా ఐస్ బకెట్ ఛాలెంజ్
ఏఎల్ఎస్ వ్యాధి నివారణ పరిశోధనల కోసం మొదలుపెట్టిన ఐస్ బకెట్ ఛాలెంజ్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సెక్సిణి పూనమ్ పాండే బికినీ ధరించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంటే.. సోఫియా హయత్ ఆమెను మించిపోయింది. తాను పూర్తి నగ్నంగా మారి ఈ ఛాలెంజిని స్వీకరించింది. ఒక బీచ్ కుర్చీ మీద నగ్నంగా పడుకొని ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది. తాను ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన తర్వాత.. గౌహర్‌ఖాన్‌ను సవాలు చేస్తూ నామినేట్ చేసింది. అయితే, ఆ తర్వాత గౌహర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, తన సవాలును వెనక్కి తీసుకుంది. పూనమ్ పాండే టూ పీస్ బికినీ ధరించి ఐస్ బకెట్ ఛాలెంజ్‌ని విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఈ ఖాన్ల త్రయాన్ని సవాలు చేసింది. ఎప్పుడూ హాట్‌గా పోజులిచ్చే పూనమ్ పాండే.. ఈ ఛాలెంజ్ స్వీకరించే సమయంలో మాత్రం చాలా చల్లగా అనిపించిందట. -
‘హీట్’ బకెట్..!
‘ఐస్’ బకెట్ చాలెంజ్ నానాటికీ వేడెక్కుతోంది. అసలు ఉద్దేశం తెరవురుగైపోరుు... బాలీవుడ్ తారల అందాల ఆరబోతకు వేదికగా మారిపోతోంది. నిన్న పూనమ్‌పాండే బికినీలో కిర్రెక్కిస్తే... తాజాగా సొగసరి భావు సోఫియూ హయుత్ ఇంకాస్త వుుందుకెళ్లి నగ్నంగా ఐస్ బకెట్‌ను మీద గువ్మురించుకుని పిచ్చెక్కించింది. ఓ బీచ్‌లో ఈ సవాలును స్వీకరించినట్టు సవూచారం. మొత్తానికి ఐస్ బకెట్ చాలెంజ్ కూడా ‘ఎ’ సర్టిఫికెట్ సినివూను తలపించేస్తున్నారు బీ-టౌన్ భావులు. -
ఇదీ రైస్ బకెట్ ఛాలెంజ్ కథ!
-
ఐస్నీళ్లు కుమ్మరించుకుంటే ఏమొస్తుంది?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ సవాల్ హల్చల్ చేస్తోంది. అదే ‘ఐస్ బకెట్ చాలెంజ్’. అమియోట్రాఫిక్ లాటరల్ స్లెరోసిస్ (ఎఎల్ఎస్) అనే వ్యాధిపై అవగాహన కలిగించడానికి యూకేలో ఎఎల్ఎస్ సంస్థ ఈ సవాల్‌ని ప్రవేశపెట్టింది. ఒక బకెట్ ఐస్నీళ్లు నెత్తి మీద కుమ్మరించుకుంటే ఈ సవాల్‌ని జయించినట్లు. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే పది డాలర్లు, చేయలేనివాళ్లు వంద డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుని ఎఎల్ఎస్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం వినియోగిస్తారు. ఓ సత్కార్యం చేయడానికి సరదాగా ప్రవేశపెట్టిన ఈ సవాల్‌ని చాలామంది నిజంగా సరదా కోసం చేస్తున్నారు తప్ప, విరాళం ఇవ్వాలనే ఆకాంక్షతో చేయడంలేదు. ఇలాంటివారి గురించేనేమో ఇలియానా తన ట్విట్టర్లో ‘‘నెత్తి మీద ఐస్నీళ్లు కుమ్మరించుకుంటే ఏం లాభం? ఎఎల్ఎస్ సంస్థకు విరాళం ఇవ్వడానికి, ఆ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప సరదాగా తీసుకోవాల్సిన విషయం కాదు’’ అని పేర్కొన్నారు. -
టాయిలెట్ నీటితో హాలీవుడ్ స్టార్ ఐస్ బకెట్ ఛాలెంజ్!
ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఐస్ బకెట్ చాలెంజ్ పేరుతో మంచినీటిని వృధా చేస్తున్నారంటూ హాలీవుడ్ నటుడు, ది బార్న్ ఐడెంటిటీ హీరో మాట్ డేమన్ నిరసన వ్యక్తం చేస్తూ కొత్త పద్దతిని ఎంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మంచినీరు, తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, అనేక పేద దేశాల్లో మంచి నీరు చాలా విలువైన వస్తువుగా మారిందని.. అలాంటి నీటిని వృధా చేస్తున్నారంటూ.. టాయిలెట్ నీటి ద్వారా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు. మంచినీటిపై అవగాహన కల్పించేందుకు ఈ పద్దతిని ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ హాలీవుడ్ నటుడు తన ఫౌండేషన్ ద్వారా మంచినీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను మంచినీటితో చేస్తే ప్రతికూల సంకేతాలను తాను పంపినట్టు అవుతుందని.. తాగునీరుపై అవగాహన కలిగించేందుకు మాత్రమే తాను ఈ రూపంలో ఛాలెంజ్ విసిరానని తెలిపారు. పలు టాయిలెట్ల నుంచి సేకరించిన నీటిని తనపై కుమ్మరించుకుని ఐస్ బకెట్ ఛాలెంజ్ ను తన సహచర నటుడు జార్జ్ క్లూనీ, సంగీత దర్శకుడు బానో, అమెరికన్ ఫుట్ బాలర్ టామ్ బ్రాడీలకు సవాల్ విసిరాడు. -
ఐస్ కాదు.. రైస్ బకెట్
ఎఎల్ఎస్ (అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిన్) వ్యాధి గురించి ఎంతమందికి తెలుసోకాని ఇప్పుడు ప్రతిఒక్కరూ ఐస్ బకెట్లతో ఒళ్లంతా తెగతడుపుకుంటున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు... సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు.. బకెట్లతో క్యూ కడుతూ సోషల్ నెట్వర్క్ సైట్లను ‘తడి’పేస్తున్నారు. అసలే మంచినీటికి మహా కరువున్న మనదేశంలో ఇదంతా అవసరమా..? కూటికి గతిలేని కోట్లాది పేదలున్న భారత్‌లో ఐస్బకెట్ల గోలెందుకు ...? అనుకునేవారు ఉన్నారు. అయితే ఇదే ఐస్‌బకెట్ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఓ మహిళ దేశీ స్టైల్లో ‘రైస్‌బకెట్ చాలెంజ్’ అనే వినూత్న దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతున్న ఐస్ బకెట్ చాలెంజ్కే సవాలు విసిరింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి.. తన చుట్టుపక్కలున్న పేదవారి ఆకలి తీర్చేందుకు ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఒక బకెట్ రైస్‌ను ఒక పేదవాడికి ఉచితంగా ఇచ్చి ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేసి‘మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి, రైస్ బకెట్ వీలుకాకుంటే కనీసం రూ.100 ల విలువైన ముందులను రోగులకు ఇవ్వండి’అని విజ్ఞప్తి చేసింది. ఫేస్బుక్లో అప్లోడ్ అయిన గంటల్లోపే ఆమె ఫ్రెండ్స్ నుంచి ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. వేలల్లో లైక్స్ వచ్చాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలమంది రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఏకంగా రైస్ బకెట్ చాలెంజ్ మీద ఫేస్బుక్ పేజీనే ఏర్పాటు చేశారు. ప్రపంచం ఐస్‌బకెట్ చాలెంజ్‌తో మునుగుతుంటే రైస్బకెట్తో ఓ తెలుగు మహిళ సవాలు విసిరడం నిజంగా అభినందనీయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు పట్టండి ఒక రైస్ బకెట్‌ను..! -
ఐస్ బకెట్ చాలెంజ్ కు ప్రియాంక చోప్రా నో!
ముంబై: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్ కు సెలబ్రిటీలు సై అంటుంటే.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం విముఖత వ్యక్తం చేసింది. ఈ నటిని చాలామంది ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించాలని నామినేట్ చేసినా ఆమె అందుకు ఆసక్తి కనబరచలేదు.ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్, బిపాస్ బసూ, అభిషేక్ బచ్చన్, సన్నీ లియోన్ తదితరులు ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రాకు ఎందుకో ఈ షోపై అంతగా ఆసక్తి లేనట్టుంది. ప్రియాంక పేరును పలువురు అభిమానులు ప్రపోజ్ చేసినా.. ఆమె మాత్రం నో అంటోంది. అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. ఈ ఛాలెంజ్ తో ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చి ఆ వ్యాధి పరిశోధనకు విరాళాలే సేకరించడమే ఈ చాలెంజ్ ప్రధాన ఉద్దేశం. -
సన్నీలియోన్ ఐస్ బకెట్ చాలెంజ్!
ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ సై అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీలియోన్ చేరిపోయారు. ఈ బాలీవుడ్ భామను ఆమె కుటుంబ సభ్యులు, ట్విట్టర్ అభిమానులు కోరడంతో ఆమె ఐస్ బకెట్ చాలెంజ్ ను సవాల్ గా స్వీకరించారు. అతి చల్లటి నీటితో తడిసిముద్దయిన సన్నీలియోన్ కాసేపు మెలికలు తిరిగిపోతూ కాసేపు వయ్యారాలు పోయారు. అనంతరం ఆమె గాయకుడు హానీ సింగ్ ను ఈ పోటీకి నామినేట్ చేశారు. లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. -
ఐస్ బకెట్ చాలెంజ్ కు 'రైస్ బకెట్' సవాల్!
హైదరాబాద్:ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగి తేలుతుంటే.. ఒక తెలుగు మహిళ ఆ చాలెంజ్ కే సవాల్ విసిరింది. అసలు ఐస్ బకెట్ ఛాలెంజ్ కంటే రైస్ బకెట్ ఛాలెంజే ముద్దు అంటోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒక వైరస్ లా విస్తరించిన సమయంలో రైస్ బకెట్ ఛాలెంజ్ ను ఆరంభించడానికి సిద్ధమయ్యారు మంజు లతా కళానిధి. దీనికి ఫేస్ బుక్ ను వారధిగా ఎంచుకున్నారు. దీనికి అంతా కలిసి రావాలని విన్నవించారు. ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు సాయం చేసే అవకాశం దక్కుతుందని ఆమె ఆశిస్తున్నారు. ఎవరైతే పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నారో వారు రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొనాలని తెలిపారు. ప్రస్తుతం ఈ రైస్ బకెట్ చాలెంజ్ ఇప్పడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. ఈ ఛాలెంజ్ తో ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చి ఆ వ్యాధి పరిశోధనకు విరాళాలే సేకరించడమే ఈ చాలెంజ్ ప్రధాన ఉద్దేశం. అయితే.. రైస్ బకెట్ చాలెంజ్ ఉద్దేశం మాత్రం పేదలకు భోజన సదుపాయంతో పాటు, రోగులకు మందులు సమకూర్చడమే. దీనికి ఆమె ఫేస్ బుక్ ద్వారా స్నేహితుల సాయం కోరుతున్నారు. ఆ ఆహారాన్ని సొంతంగా తయారు చేసి కానీ, కొనుగోలు చేసి అయినా కానీ పేదలకు అందజేయవచ్చు. ఒకవేళ రోగులకు సాయం చేయాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరూ కనీసం రూ.100 తక్కువ కాకుండా మందులను ఇవ్వొచ్చు. సామాజిక చైతన్యం కల్గించడానికి ఎన్ని చాలెంజ్ లు ప్రవేశపెట్టినా ఫర్వాలేదు గానీ.. మరి సాయం చేయడానికి ఎన్ని చేతులు కలుస్తాయో వేచి చూడాల్సిందే. -
ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను!
ఇప్పుడు సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగితేలుతుంటే.. బేవాచ్ స్టార్, జంతువుల హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ మాత్రం ససేమిరా అంటోంది. అసలు సాహసమంటే.. ఐస్ బకెట్ చాలెంజ్ కాదని తెలిపింది. 'నేను ఈ సవాల్ ను స్వీకరించలేను. అసలు సాహసమంటే నలుగురికి మంచి చేసేదిగా ఉండాలి. వాటికే నా మద్దతు ఉంటుందని' ఆమె స్పష్టం చేసింది. ఐస్ బకెట్ సవాలు విసురుతున్న ఏఎల్ఎస్ అసోసియేషన్‌ను..ముందుగా జంతువులపై చేస్తున్న ప్రయోగాలు ఆపి, మానవాళి బాగు కోసం ఏదైనా సరికొ్త్తగా ఆలోచించాలని తెలిపింది. మానవులకు వచ్చే వ్యాధుల నివారణ కోసం పాటుపడాలని ఏఎల్ఎస్ కు విజ్ఞప్తి చేసింది. అసలు జంతువుల ప్రయోగాలనేవి కేవలం క్రూరత్వంతో కూడున్నవని..నిజమైన మానవాళి అభివృద్ధికోసం పాటు పడే శాస్త్రవేత్తలకు సహకరించండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ ఫేస్ బుక్ పోస్ట్ భారీ షేర్లను నమోదు చేసుకుంది. ఈ అమ్మడు కామెంట్ కు 43 వేల మంది లైక్స్ కొట్టగా, 15 వేల మంది షేర్ చేసుకోవడం గమనార్హం. -
ఐస్‌బకెట్ ఛాలెంజ్‌ను చేధించిన మంచు లక్ష్మి
-
వాటీజ్ దిస్..!
ప్రపంచ సెలబ్రిటీలంతా ఇప్పుడు ఐస్ బకెట్ చాలెంజ్‌లో మునిగి తేలుతుంటే... ‘బేవాచ్’ స్టార్ పమేలా అండర్సన్ వూత్రం అందుకు ససేమిరా అంటోంది. ‘ఈ సవాలు స్వీకరించలేను. సాహసవుంటే క్రియేటివ్‌గా, నలుగురికీ వుంచి చేసేలా ఉండాలి. అలాంటి వాటికే నా వుద్దతు’ అంటూ చెప్పుకొచ్చింది. ఐస్ బకెట్ సవాలు విసురుతున్న ఏఎల్ఎస్ అసోసియేషన్‌ను.. వుుందుగా జంతువులపై చేస్తున్న ప్రయోగాలు ఆపి, వూనవాళి బాగు కోసం పాటుపడే సైంటిస్ట్లకు సహాయుపడవునండి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. -
ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సోనాక్షి కొత్త ట్విస్టు!!
ఐస్ బకెట్ ఛాలెంజ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న పరిశోధనల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఓ సరికొత్త పద్ధతిలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది. ఎవరూ తనను ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదని అంటూ.. బకెట్లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని, దాన్ని తన తలమీద నుంచి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయడం మాని ముందు ఆ సైట్లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ మేరకు ఫేస్బుక్లో తన వీడియోను కూడా పోస్ట్ చేసింది. 'ఎవరూ నన్ను నామినేట్ చేయలేదు. అయినా నేను ఛాలెంజ్ స్వీకరించాను. ఇప్పుడు మీ అందరినీ నేను నామినేట్ చేస్తున్నాను. మీరు ఇప్పటికే స్నానం చేసి ఉంటే మాత్రం ఐసునీళ్లు పోసుకోవద్దు. స్నానం చేయకపోతే మాత్రం మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా www.als.org సైట్లోకి వెళ్లి విరాళాలు మాత్రం ఇవ్వండి' అని అందులో రాసింది. దీనివల్ల ఏఎస్ఎల్ వ్యాధి నివారణకు పరిశోధనలకు మరింత ఊతం అందే అవకాశం ఏర్పడింది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి.. ఇటు పర్యావరణానికి కూడా మేలు చేస్తున్న సోనాక్షి సిన్హా నిజంగానే అభినందనీయురాలు కదూ!! -
'ఐస్ బకెట్ చాలెంజ్' సృష్టికర్త మృతి
'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్ మృతి చెందారు. మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మునిపోయారు. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. 27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరోపకారం కోసం ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గిఫ్రిన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. -
కూల్ ఛాలెంజ్
నెత్తి మీద నుంచి బకెట్‌తో నీళ్లు పోసుకోమంటే హ్యాపీ. అయితే ఆ నీళ్లు పొగలు కక్కేంత కూలింగ్‌తో ఉండాలని కండిషన్ పెడితే.. వామ్మో అంటాం కదా.. మరదే చాలెంజ్ అంటే! ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోందీ.. ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్. అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. అమెరికాకు చెందిన బేస్‌బాల్ ప్లేయర్ పెటె ఫ్రేట్స్ దీని బారిన పడ్డాడు. వ్యాధిపై అందరికీ అవగాహన కలిగించేందుకు కొత్త పంథా ఎన్నుకున్నాడు. గత నెలలో ఓ రోజు.. ఐస్‌కోల్డ్ వాటర్‌ను తల మీద నుంచి పోసుకున్నాడు(ఈ వ్యాధి కలిగించే బాధ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ఐస్‌వాటర్ ట్రీట్మెంట్ కూడా ఒక మార్గమట). ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టి.. ఇలా మీరు చేయగలరా? అంటూ చాలెంజ్ చేశాడు. దీనిని స్వీకరించినవారు 24గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో 100 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది పార్టిసిపెంట్స్ పెద్దమనసుతో చాలెంజ్ పూర్తి చేసి కూడా డబ్బు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఈ చాలెంజ్‌ను నెట్‌స్క్రీన్‌కి ఎక్కించాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలను అందరినీ బకెట్ బాట పట్టించాయి. యూట్యూబ్‌లోని వారి వీడియోలకు అడ్వర్టయిజ్‌మెంట్స్ రూపంలో డబ్బులు రాసాగాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎఎల్ఎస్ ఫౌండేషన్ దీనిని ఒక పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌గా చేపట్టింది. వ్యాధి నివారణ గురించిన పరిశోధనలకు నిధుల సమీకరణ కోసం మార్గంగా మార్చింది. ఈ చాలెంజ్ ఇప్పటికే దాదాపు 10 దేశాలను చుట్టేసింది. 15.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే వ్యాధిపై పరిశోధనకు మరింత మొత్తం అవసరం అంటున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు. లాస్ ఏంజెలిస్ నుంచి సిటీ వరకు.. డేవిడ్ బెక్‌హామ్, సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్.. క్రిస్టియానో రొనాల్డొ, జస్టిన్ టింబర్లేక్, జిమ్మీ ఫాలన్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఐస్ బక్కెట్‌కి సై అన్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బిపాసా బసు, అభిషేక్ బచ్చన్, సోనాక్షి సిన్హా.. వంటివారంతా సై సై అన్నారు. తాజాగా ఈ చాలెంజ్ సిటీకి వచ్చింది. ఇక్కడి సెలిబ్రిటీలను కూడా కదిలించింది. ఈ ఎఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌ను నగరానికి తీసుకొచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ హన్సిక మోత్వాని. తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యాన్స్‌ను కూడా చాలెంజ్‌కు నామినేట్ చేసింది. ఆమెతో పాటు సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, హీరో హర్షవర్ధన్ రాణే, నితిన్, ఉజ్వల్ భల్లా తదితర సెలబ్రిటీలు చాలెంజ్‌లు అందుకోవడమే ఆలస్యం.. బకెట్లతో ఐస్‌నీళ్లను నెత్తి మీద కుమ్మరించుకుంటూ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణేను గుత్తా జ్వాల చాలెంజ్ చేస్తే.. రంగం ఫేమ్ కార్తీకను, రానా దగ్గుబాటి తదితరులను హర్ష చాలెంజ్ చేశాడు. సిటీకి జస్ట్ ఇప్పుడే ఎంటరైన ఈ బకెట్ మేనియా మరెంతమంది నెత్తి మీద నాట్యం చేస్తుందో చూడాలి. ..:: ఎస్.సత్యబాబు -
భార్యకు అక్షయ్ 'ఐస్ బకెట్ ఛాలెంజ్'!
ముంబై: ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరోలు సై అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చేరిపోయారు. 'డేర్ టూ డ్యాన్స్' కార్యక్రమంలో భాగంగా చిల్లీ ఎన్విరాన్స్ ఆఫ్ కేప్ టౌన్ కు హాజరైన అక్షయ్.. ఐస్ బకెట్ తో తడిసి ముద్దయ్యాడు. తొలుత ఐస్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరించిన అక్షయ్.. ఆ నీళ్లను తనపై పోయించుకునే ముందు కళ్లు మూసుకుని నిలబడ్డాడు. అంతే అప్పటికే అక్షయ్ చుటూ సిద్ధంగా ఉన్న పది మంది బకెట్లలోని నీళ్లను అతనిపై పోశారు. దాంతో కాసేపు చలికి వణికిన అక్షయ్ అక్కడ గంతులేస్తూ ఆ అలసటను తీర్చుకున్నాడు. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కు తన భార్య ట్వింకిల్ ఖన్నాతో పాటు, కండల వీరుడు సల్మాన్ ఖాన్, జానీ లీవర్ ను అక్షయ్ నామినేట్ చేశాడు. లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. అంతకుముందు అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐఎస్ వాటర్ బకెట్ ను తన మీద కుమ్మరించుకున్నారు. అంతేకాకుండా తన కూతరు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు. -
ఛాలెంజ్ గురూ..!!
-
బిల్ క్లింటన్ కు సవాల్ విసిరిన జార్జ్ బుష్!
వాషింగ్టన్: 'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రీటీలు తడిసిముద్దవుతున్నారు. ఓ వైరల్ ఫీవర్ లా ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రముఖులను వెంటాడుతోంది. తాజాగా అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐఎస్ వాటర్ బకెట్ ను తన మీద కుమ్మరించుకున్నారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు బుష్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా తన కూతరు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు. లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసిరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను హన్సికా ఛేదించింది!