చల్లటి ఛాలెంజ్
ఈ మధ్యనే ప్రపంచమంతా ‘ఐస్‌బకెట్ ఛాలెంజ్’ తో వణికి ఆనందించింది. చైనాలో ఇలాంటి సంప్రదాయమే ఒకటుంది. దీన్ని ‘ఐస్‌వాటర్ ఛాలెంజ్’ అంటారు. ఐస్‌తో ఉండే కొలను లోకి దిగి, చేతులతో పెద్ద మంచుపలకను పట్టుకొని, ఐస్ క్రీమ్ తినాలి. దీనికి తోడు పక్కనుంచి చల్లటి గాలి విసిరే ఫ్యాన్‌ఎఫెక్ట్ అదనం. ఇలాంటి చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు హనాన్ ప్రావీన్స్‌లోని జాంగ్జియాజీ పట్టణవాసులు. సరదాగా సాగే ఈ పోటీలో ఎక్కువసేపు ఆ కొలనులో ఉన్నవారే విజేతలు.
దానమహోత్సవం
దానం ఇవ్వడం ఎక్కడైనా గొప్ప పనే. ఈ పనికి ప్రత్యేకంగా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, సందర్భాలు కూడా ప్రతి సంస్కృతిలోనూ ఉంటాయి. తన ఆస్తులన్నింటినీ దానంగా ఇచ్చి సన్యాసిగా మారిన 19వ శతాబ్దపు స్పెయిన్ ధనవంతుడు సాన్ ఆంటోనియో అబాద్ స్ఫూర్తితో స్పెయిన్‌లో ప్రతి ఏడాదీ జనవరి 25న దానోత్సవం మొదలవుతుంది. 36 గంటలపాటు స్పెయిన్ ప్రజలు తమకు చేతనైనంత దానం చేస్తూ ఆంటోనియో స్ఫూర్తిని చాటుతారు. ఈ సందర్భంగా ఇటీవల స్పెయిన్ దక్షిణ ప్రాంతంలోని ట్రిగ్యురోస్ అనే గ్రామంలో సంబరాల్లో భాగంగా ఒక మహిళ ఇంటి కిటికీలోంచి బ్రెడ్‌రోల్స్‌ను విసురుతోంది.
సైకిలెక్కిన సాహసం
టూ వీలర్ నడపడం ఈజిప్షియన్ మహిళ ధైర్యసాహసాలకు నిదర్శనం. మహిళలు సైకిల్ తొక్కడం, మోటర్ సైకిల్ నడపడంపై చాలా అరబ్ దేశాల్లో నిషేధం ఉంది. అయితే ఈజిప్టులో అధికారికంగా నిషేధం ఏమీ లేకపోయినా సంప్రదాయవాదుల తీరుతో ఈ దేశంలో వీటిపై అప్రకటిత నిషేధం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా రాజధాని కైరో వీధుల్లో కొంతమంది యువతులు సైకి ల్‌లో దూసుకుపోతూ కనిపిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి వీరిది పెద్ద సాహసమే.
లెన్స్ - ఎసెన్స్
Published Sun, Feb 8 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement