ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను! | Pamela Anderson refuses Ice Bucket Challenge | Sakshi
Sakshi News home page

ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను!

Published Sat, Aug 23 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను!

ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను!

ఇప్పుడు సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగితేలుతుంటే.. బేవాచ్ స్టార్, జంతువుల హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ మాత్రం ససేమిరా అంటోంది. అసలు సాహసమంటే.. ఐస్ బకెట్ చాలెంజ్ కాదని తెలిపింది. 'నేను ఈ సవాల్ ను స్వీకరించలేను. అసలు సాహసమంటే నలుగురికి మంచి చేసేదిగా ఉండాలి. వాటికే నా మద్దతు ఉంటుందని' ఆమె స్పష్టం చేసింది.
 

ఐస్ బకెట్ సవాలు విసురుతున్న ఏఎల్‌ఎస్ అసోసియేషన్‌ను..ముందుగా జంతువులపై చేస్తున్న ప్రయోగాలు ఆపి, మానవాళి బాగు కోసం ఏదైనా సరికొ్త్తగా ఆలోచించాలని తెలిపింది. మానవులకు వచ్చే వ్యాధుల నివారణ కోసం పాటుపడాలని ఏఎల్ఎస్ కు విజ్ఞప్తి చేసింది. అసలు జంతువుల ప్రయోగాలనేవి కేవలం క్రూరత్వంతో కూడున్నవని..నిజమైన మానవాళి అభివృద్ధికోసం పాటు పడే శాస్త్రవేత్తలకు సహకరించండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ ఫేస్ బుక్ పోస్ట్ భారీ షేర్లను నమోదు చేసుకుంది. ఈ అమ్మడు కామెంట్ కు 43 వేల మంది లైక్స్ కొట్టగా, 15 వేల మంది షేర్ చేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement