Pamela Anderson Files Divorce With Her 5th Husband Dan Hayhurst, Deets Inside - Sakshi
Sakshi News home page

Pamela Anderson Divorce: ఐదో భర్తకు విడాకులివ్వనున్న నటి!

Published Fri, Jan 21 2022 1:13 PM | Last Updated on Fri, Jan 21 2022 1:41 PM

Pamela Anderson Files Divorce With Her 5th Husband Dan Hayhurst, Deets Inside - Sakshi

ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు ఆమె ఏకంగా నాలుగుసార్లు విడాకులు తీసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఐదో భర్తకు విడాకులిచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆవిడెవరో కాదు.. హాలీవుడ్‌ నటి పమేలా అండర్సన్‌. 54 ఏళ్ల వయసున్న పమేలా అండర్సన్‌ నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా అవి పెటాకులయ్యాయి. ఆ తర్వాత 2020లో ఐదో పెళ్లి చేసుకుందీ నటి. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌లో తన బాడీగార్డ్‌ డాన్‌ హేహస్ట్‌కు దగ్గరైంది. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

వివాహ బంధంతో కలకాలం కలిసుందామనుకున్నారు. అలా లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ వీరికి కాలం కలిసిరానట్లు కనిపిస్తోంది. పెళ్లై ఏడాది తిరగకముందే దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

కాగా పమేలా అండర్సన్‌ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 1995లో టామీ లీని తొలిసారిగా పెళ్లాడింది. వీరికి బ్రాండన్‌, డైలాన్‌ అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2006లో సంగీతకారుడు కిడ్‌ రాక్‌ను పెళ్లాడింది కానీ ఈ బంధం కూడా నిలవలేదు. 2014లో రిక్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఓ షోలో ప్రకటించింది పమేలా. అయితే ఈ సంతోషం కూడా ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు. ఆ మరుసటి ఏడాదే ఇద్దరూ విడిపోయారు. 2020లో నిర్మాత జాన్‌ పీటర్స్‌ను సీక్రెట్‌గా పెళ్లాడగా కొద్ది రోజులకే అది కూడా పెటాకులైంది. అదే ఏడాది డిసెంబర్‌లో బాడీగార్డ్‌ డాన్‌తో వైవాహిక బంధాన్ని ఆరంభించిన పమేలా ఇప్పుడు దాన్ని కూడా తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement