'ఐస్ బకెట్ చాలెంజ్' సృష్టికర్త మృతి
'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్ మృతి చెందారు. మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మునిపోయారు.
పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.
27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరోపకారం కోసం ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గిఫ్రిన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రపంచమంతా కోరుకుంటోంది.