తప్పించుకునేందుకు చిమ్నీలో దూరాడు
ఇటుకలు తొలగించి రక్షించి, అరెస్ట్‌చేసిన పోలీసులు
నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న కారణంతో అతని ఇంటిని సోదాచేయడానికి పోలీసుల బృందం రంగంలోకి దిగగా పారిపోయేందుకు సిద్ధపడ్డ ప్రబుద్ధుడు ఎవరికీ అనుమానం రావొద్దని చిమ్నీలో దాక్కోబోయాడు. అందులో ఇరుక్కుపోయి చివరకు సాయం కోసం బిగ్గరగా అరచి తన జాడ తానే పోలీసులకు చెప్పేశాడు.
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని రివర్ ఫాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం 33 ఏళ్ల రాబర్ట్ లాంగ్లేస్ వద్ద నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని తెల్సి మంగళవారం పోలీసులు సెర్చ్ వారెంట్‌తో రాబర్ట్ ఇంటికొచ్చారు. అరెస్ట్ చేద్దామని ఇళ్లంతా వెతికినా రాబర్ట్ దొరకలేదు. అయితే ఇదే సమయంలో ఇంటి వెనుక ఎవరో సాయం కోసం అరుస్తున్న శబ్దం వస్తోందని అటుగా దారిన పోయే వ్యక్తులు చెప్పారు.
దీంతో పోలీసులు ఇంటిపైకప్పు మీదకొచ్చి చూస్తే ఎవరూ లేరు. ఒకాయన చిమ్నీ గొట్టం ఎక్కడం చూశా అని అటూగా పోతున్న ఇంకొక వ్యక్తి చెప్పడంతో చిమ్నీ గొట్టంలోకి పోలీసులు తొంగిచూశారు. అందులో ఇరుక్కుని ఎటూపోలేక అవస్థలు పడుతున్న రాబర్ట్‌ను చూసి పోలీసులకు విపరీతంగా కోపమొచి్చంది. ‘‘నువ్వెంత మూర్ఖుడివిరా బాబు. అందులో దూరి ఎలా దాక్కున్నావనుకున్నాం.
దాంట్లోంచి అవతలికి పారిపోదామనుకున్నావా?’అంటూ అతడిని ప్రశ్నించారు. ముందుగా అతడిని బయటపడేసే మార్గం కోసం వెతికారు. చివరకు చిమ్నీ అడుగుభాగాన్ని మాత్రం బద్దలుకొట్టి బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అగ్నిమాపక సిబ్బందిని పిలిచించి కొన్ని ఇటుకలు తీయించారు. బయటకు వచ్చేయ్ అని హెచ్చరించారు. భయపడుతూ ఎలాగోలా అందులోంచి బయటపడిన రాబర్ట్‌ను పోలీసులు పోలీసుల బండిలో పడేశారు. నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఇరుక్కునప్పుడు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం కేసు విచారణ నడుస్తోంది.
– ఫాల్ రివర్ సిటీ
Comments
Please login to add a commentAdd a comment